ఈ కాంబినేషన్ కలే

త్రివిక్రమ్ శ్రీనివాస్-రామ్ చరణ్ ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న జనాలు లేకపోలేదు. మెగా అభిమానుల్లో చాలా మందికి ఈ కాంబినేషన్ ఎప్పుడు వుంటుందా అన్న ఆశ వుందన్న మాట వాస్తవం. కానీ త్రివిక్రమ్ ఎందుకో అటు మొగ్గు చూపడం లేదు. ప్రస్తుతానికి త్రివిక్రమ్ ముందు వున్న కమిట్మెంట్ లు చూస్తుంటే, ఈ కాంబినేషన్ సమీపంలో కాదు, భవిష్యత్ లో కూడా సెట్ కాదేమో అనిపిస్తుంది. 

పవన్ సినిమాతోనే 2017 సమ్మర్ దాటే వరకు త్రివిక్రమ్ కు సరిపోతుంది. ఆ తరువాత మహేష్ బాబు సినిమా చేయాలి. అది అయ్యేసరికి 2018 వస్తుంది. 

అప్పటికి రామ్ చరణ్ టైమ్ ఎలా వుంటుందో? దానయ్యకు ఇటు రామ్ చరణ్, అటు త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వుంది. మరి అలా ఆ కాంబినేషన్ సెట్ అయితే కావాలి. లేదంటే లేదు.? మరోపక్క రామ్ చరణ్, సుకుమార్, మణిరత్నం లాంటి కాంబినేష్లు సెట్ చేసుకు వెళ్తున్నారు. కొరటాల శివ తో కూడా సినిమా వుంటుందని టాక్. అందువల్ల చరణ్ కూడా త్రివిక్రమ్ సినిమా మీద అంత దృష్టి పెట్టినట్లు కనిపంచడం లేదు. సో త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ సెట్ అవడం అంత త్వరగా జరగేలా లేదు.

Show comments