బాహుబలి-2.. మరో 2 రికార్డులు బ్యాలెన్స్

మరో వీకెండ్ వచ్చేస్తోంది. అందరి కన్ను బాహుబలి-2పై అలానే ఉంది. మరి ఈ వీకెండ్ బాహుబలి-2 ముందున్న లక్ష్యాలేంటి..? ప్రస్తుతానికైతే 2 టార్గెట్స్ రెడీగా ఉన్నాయి. ఒకటి బాలీవుడ్ రికార్డు అయితే, ఇంకోటి ఇంటర్నేషనల్ రికార్డు. ఈ వీకెండ్ రన్ తో ఈ రెండు రికార్డుల్ని అందుకోవాలని బాహుబలి తహతహలాడుతున్నాడు. 

బాలీవుడ్ లో ఇప్పటివరకు 4వందల కోట్ల రూపాయల క్లబ్ క్రియేట్ అవ్వలేదు. ఈ వీకెండ్ వసూళ్లతో బాహుబలి-2 హిందీ వెర్షన్ ఆ ఘనత సాధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకు 376 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈరోజు లేదా రేపు ఈ సినిమా 4వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశముంది.

ఇప్పటివరకు బాలీవుడ్ లో అత్యధిక వసూళ్ల రికార్డు దంగల్ పేరిట ఉంది. ఫైనల్ రన్ లో ఈ సినిమా 387 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. ఈ సంఖ్యను అధిగమించడంతో పాటు.. 400 కోట్ల రూపాయల క్లబ్ ను బాహుబలి-2 క్రియేట్ చేయబోతోంది.

ఇక ఇంటర్నేషనల్ రికార్డు విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 12వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్ ముగిసేసరికి ఈ సంఖ్యను 1500 కోట్ల రూపాయలకు తీసుకెళ్లాలనేది టార్గెట్. ఈ 2 రికార్డులు అందుకోవడం బాహుబలి - ది కంక్లూజన్ సినిమాకు ఏమంత కష్టం కాదు.

Show comments