హీరోయిన్ ను పరిచయం చేస్తే ఏమౌతుందో తెలుసా మహేష్...

ఇండస్ట్రీలో ఎవరైనా హీరోయిన్ ను పరిచయం చేయొచ్చు. ఒక్క మహేష్ తప్ప. అవును.. మహేష్ మాత్రం హీరోయిన్లను పరిచయం చేయకూడదు. అలా చేస్తే అది మహేష్ కే దెబ్బ. ఇదేదో కొత్తగా చెబుతున్న విషయం కాదు. మహేష్ ట్రాక్ రికార్డే ఈ విషయాన్ని తేల్చిచెబుతోంది. హీరోయిన్ ను పరిచయం చేసిన ప్రతిసారి ఈ హీరోకు ఫ్లాపులే వచ్చాయి. 

నమ్రతా శిరోద్కర్, బిపాసా బసు, అమృతారావు, కృతిసనోన్.. ఇలా కొంతమంది భామల్ని టాలీవుడ్ కు పరిచయం చేశాడు మహేష్. అలా పరిచయం చేసిన ప్రతిసారి ఫ్లాప్ కొనితెచ్చుకున్నాడు. వంశీ సినిమాతో నమ్రతను పరిచయం చేశాడు. ఆ సినిమా డిజాస్టర్. ఇక బిపాసా బసును పరిచయం చేస్తూ టక్కరిదొంగ సినిమా చేశాడు. అది కూడా డిజాస్టరే. వీళ్లతో పాటు అతిథి సినిమాతో అమృతారావును, వన్ - నేనొక్కడినే మూవీతో కృతిసనోన్ ను తెలుగుతెరకు పరిచయం చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాపులే. 

ఇలా చెప్పుకుంటూపోతే.. హీరోయిన్ ను పరిచయం చేస్తూ హిట్ కొట్టిన సందర్భాలు మహేష్ కెరీర్ లో చాలా తక్కువ. ఒక్క మురారి సినిమా మాత్రం దీనికి మినహాయింపు. సోనాలీ బింద్రే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా, అప్పట్లో ఎబోవ్ యావరేజ్ హిట్ టాక్ గా నిలిచింది. అందుకే కొత్త హీరోయిన్లు మహేష్ కు ఎప్పుడూ కలిసిరాలేదు. ఇంత ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ... మహేష్ తో చేయబోయే సినిమా కోసం కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఈ విషయంలో కాస్త ఈ  హిస్టరీని కూడా మైండ్ లో పెట్టుకుంటే మంచిదేమో...

Show comments