మెగాస్టార్ ఏమైనా రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కా?

మెగాస్టార్ అనగానే మనకు చిరంజీవి గుర్తుకు వస్తే, నార్త్ జనాలకు అమితాబ్ గుర్తుకు వస్తారు. సూపర్ స్టార్ అంటే మనకు మహేష్ గుర్తుకు వస్తే, తమిళ జనాలకు రజనీ గుర్తుకు వస్తారు. అలా అని చెప్పి ఇవేమీ పద్మశ్రీలో, పద్మభూషణ్ లో కావు. అభిమానులు తమ అభిమానంతో ఇచ్చినవి.

మరి కొన్ని అయితే, ఫస్ట్ సినిమాతోటే తాము ఇంత గొప్ప, అంత గొప్ప అనుకుని వాళ్లకు వాళ్లే తగిలించేసుకున్నవి. అంత మాత్రం చేత అవే టైటిళ్లు మరొకరికి తగిలించకూడదని లేదు. అయితే ఎటొచ్చీ అభిమానులు ఫీలవుతారంతే.

ఇప్పుడు డిజె సినిమా విషయంలో ఇలాంటి తకరారే చిన్నది వచ్చినట్లు, దాన్ని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, ఆయన అనుచరులు కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ మొత్తం విషయం ఇలా వుంది.

ఆన్ లైన్ లో టికెట్ లు అమ్మే అప్లికేషన్ ల్లో అగ్రగామి అయిన బుక్ మై షో, ఎక్కడో ఓ చోట పొరపాటునో, గ్రహపాటునో మెగాస్టార్ అల్లు అర్జున్ ఈజ్ బ్యాక్ అని పెట్టిందట.

ఇదంతా డిజె సినిమా టికెట్ లు అమ్ముకునే వ్యవహారం తప్ప వేరు కాదు. కానీ దీన్ని మెగాభిమానులే కాదు, మెగా ఫ్యామిలీ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మెగాభిమానులు ఈ విషయమై వివిధ సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డు తమదే అని బన్నీ అండ్ కో ప్రకటించడంతో మెగాస్టార్ అండ్ కో కు చాలా మండుతున్నట్లు వినికిడి. కష్టపడి తెచ్చుకున్న ఖైదీ నెం 150 రికార్డు గాలికిపోయినట్లయింది. దీనికి తోడు ఇప్పుడు ఏకంగా బన్నీనే మెగాస్టార్ అనేసరికి ఇంకేముంది. అభిమానులు భగ్గుమంటున్నారు.

ఇదంతా బన్నీకి తెలిసినా, తెలియకపోయినా, అల్టిమేట్ గా బన్నీనే టార్గెట్ అవుతున్నాడు. టోటల్ గా మెగాభిమానులు ఇప్పుడు చిరు, రామ్ చరణ్, పవర్ స్టార్ అభిమానులుగా మారిపోయారు.

ఒక విధంగా చెప్పాలంటే బన్నీని ఒంటరిని చేసారు మెగాభిమానులు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు డిజె సినిమా మీద కేవలం టాక్ వరకే పడింది. కానీ తరువాతి సినిమా కలెక్షన్ల మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం వుందేమో?

అయినా ఇదేం గొడవ? మెగాస్టార్ అన్నది ఏమన్నా ట్రేడ్ మార్కా? ఒకరికి వాడింది ఇంకొకరికి వాడకూడదా? భారతరత్నలు, పద్మ విభూషణ్ లు ఎంత మంది లేరు? వాటికన్నా గొప్పవా ఏమిటి? ఈ బిరుదులు.

లేదూ బిరుదులే గొప్పవి అయితే, విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ అనే బిరుదు వుండగా ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు అడగడం? అభిమానులు మరీ వెర్రి అభిమానం తగ్గించుకోవాలి.

Show comments