మహేష్‌ సిక్స్‌ ప్యాక్‌లో కన్పిస్తాడా.?

'సూపర్‌ స్టార్‌ మహేష్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో కనిపించబోతున్నాడట..' 

- ఇది '1 నేనొక్కడినే' సినిమా టైమ్‌లోనే ప్రచారంలోకొచ్చిన గాసిప్‌. ఆ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశాడుగానీ, మధ్యలోనే విరమించేసుకున్నాడు మహేష్‌ ఆ ప్రయత్నాన్ని. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మళ్ళీ అలాంటి ప్రయత్నమేదీ మహేష్‌ ఇప్పటిదాకా చేయలేదు. 

అయితే, తాజాగా 'స్పైడర్‌' సినిమా కోసం మహేష్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో కనిపించబోతున్నాడంటూ ఓ గాసిప్‌ తెరపైకొచ్చింది. 'స్పైడర్‌' ఫస్ట్‌ లుక్‌ ఫొటోస్‌ వచ్చిన తర్వాత ఈ గాసిప్స్‌కి మరింత బలం చేకూరుతోంది. సూపర్‌ ఫిట్‌గా కన్పిస్తున్నాడు మహేష్‌ ఈ స్టిల్స్‌లో. పైగా 'స్పై' క్యారెక్టర్‌ కావడంతో, మహేష్‌ ఈ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి వుండొచ్చని టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

మరోపక్క, ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ప్రముఖ దర్శకుడు ఎస్‌జె సూర్య కూడా, ఫిజిక్‌ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. గతంలోనే సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ సొంతం చేసుకున్న ఎస్‌జె సూర్య, ఈ సినిమా కోసం కండలు తిరిగిన శరీరంతో కన్పించబోతున్నాడట. మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పైడర్‌' సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. 

అన్నట్టు, 'స్పైడర్‌' ఫస్ట్‌ లుక్‌ ఫొటోలు, మోషన్‌ పోస్టర్‌.. విడుదలైన కాస్సేపట్లోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. తమ అభిమాన హీరో సినిమా కోసం ఆ స్థాయిలో ఇప్పటిదాకా ఉత్కంఠగా ఎదురు చూశారు మరి మహేష్‌ అభిమానులు.

Show comments