టీడీపీ ఎమ్మెల్యే ఇంట బయటపడింది రూ.265కోట్లు?

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారాల గురించి దర్యాప్తు చేస్తున్న అధికారులే తెలుగుదేశం ఎమ్మెల్యే డీకే సత్యప్రభ ఇంటిపై దాడులు నిర్వహించారా? ఈ దాడుల్లో ఏకంగా 250 కోట్ల రూపాయల పై స్థాయి ఆస్తుల గుర్తింపు జరిగిందా? వారం రోజుల కిందట చిత్తూరు జిల్లాలోని డీకే సత్యప్రభ ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. ఒక రోజు మొత్తం కేటాయించి.. అధికారులు సోదాలు జరిపారు. 

ఉదయం ఎనిమిదింటికి మొదలుపెడితే.. రాత్రి ఎనిమిదింటి వరకూ అధికారుల సోదాలు కొనసాగాయి. వీటిల్లో భారీ ఎత్తున అక్రమాలు పట్టు బడినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. డీకే సత్యప్రభ ఆర్థిక వ్యవహారాల్లోని లొసుగుల గురించి ఈ దాడులు జరిగాయని మొదట ప్రచారం జరిగినా.. ఇది మాల్యా కేసులో విచారణలో భాగమనే మాటా వినిపిస్తోంది.

ఒక ప్రజాప్రతినిధి, అందునా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంట ఇలా 250 కోట్ల రూపాయల పై స్థాయి ఆస్తులను గుర్తించడం అంటే సంచలనం అనే చెప్పాలి. డీకే సత్యప్రభ భర్త డీకే ఆదికేశవుల నాయుడికి.. లిక్కర్ కింగ్ విజయమాల్యాకూ ఉన్న అనుబంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు. మాల్యా వెలుగుతున్న రోజుల్లో.. ఆదికేశవులు నాయుడు ఆయనతో రాసుకుపూసుకు తిరిగేవాడు. డీకే ఫ్యామిలీకి బెంగళూరులో కూడా పెద్ద వ్యాపారసామ్రాజ్యమే ఉంది. మరి తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడి విషయంలో తెలుగుదేశం ఇంత వరకూ స్పందించలేదు. ఏకంగా వందల కోట్లు అక్రమ ఆస్తులు బయటపడ్డాయన్న మాటపై కూడా టీడీపీ ఉలుకూపలుకూ లేకుండా ఉండటం గమనార్హం! 

Show comments