అయ్యో.. వీళ్లు నిజంగానే సిల్లీ ఫెలోస్

రిలీజ్ అవ్వకముందే సినిమాకు క్రేజ్. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి జనాలకు అంతగా పట్టింపు ఉండదు. అందుకే సినిమావాళ్లంతా తమ సినిమా బిజినెస్ ను విడుదలకు ముందే క్లోజ్ చేయాలని చూస్తారు. మరీ ముఖ్యంగా డిజిటల్, శాటిలైట్ వీలైనంత త్వరగా లాక్ చేసుకుంటారు. కానీ ఈ విషయంలో సిల్లీఫెలోస్ సినిమా ఫెయిలైంది.

థియేటర్లలోనే కాకుండా, శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా సిల్లీఫెలోస్ ఫెయిలైంది. సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా నటించిన ఈ రీమేక్ సినిమా ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. నిజంగా విడుదలకు ముందే డీల్ సెట్ చేసి ఉన్నట్టయితే, ఈపాటికి ఏదో ఒక ఛానెల్ లో సినిమా టెలీకాస్ట్ అయిపోయేది. కానీ మేకర్స్ అత్యుత్సాహం వల్ల ఈ సినిమా గాల్లో దీపంగా మారింది.

సునీల్, అల్లరినరేష్ కలిసి నటిస్తున్న కామెడీ మల్టీస్టారర్ కాబట్టి భారీ రేటుకు ఈ సినిమా శాటిలైట్ అమ్ముడుపోతుందని నిర్మాతలు భావించారు. కానీ వీళ్లు చెప్పిన మొత్తానికి హక్కులు తీసుకునేందుకు ఏ ఛానెల్ ముందుకురాలేదు. ఈలోగా సినిమా థియేటర్లలోకి రావడం, ఫ్లాప్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

దీంతో సిల్లీఫెలోస్ ను ఏ ఒక్క ఛానెల్ పట్టించుకోవడం మానేసింది. అలా సిల్లీఫెలోస్ శాటిలైట్ కథ, చాలా సిల్లీగా మారింది. 

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments