రజనీ తాలూకా బాకీలు రేపు తీర్చబడును?

రజనీ గొప్పవారు..అద్భుతమైన ఫ్యాన్  ఫాలోయింగ్ వున్న నటుడు..ఇంకా ఇంకా ఎన్నో, ఎన్నో, కానీ రజనీ ఓ కూతురికి తండ్రి. అందుకే గుడ్డిగా కూతురు ప్రాజెక్టుకు తల ఊపారు. కూతురు అప్పులకు భార్య సంతకాలు పెట్టేస్తున్నా కాదన లేకపోయారు. ఆ అప్పులు తన సినిమాలు కొంటున్నవారిని నానా బాధలు పెడుతున్నా చూస్తూ అలాగే ఊరుకున్నారు. కబాలి సినిమా విషయంలో రజనీ కావాలని చాలా ప్లాన్డ్ గా వ్యవహరించారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

చాలా వెల్ ప్లాన్డ్ గా కబాలి సినిమా విషయంలో రజనీ వ్యవహరించారని వదంతులు వినిపిస్తున్నాయి. తన రెమ్యూనిరేషన్ మినహా మిగిలిన సినిమాను అతి తక్కువలో చుట్టేస్తున్నా, మేకింగ్ వాల్యూ అన్నది స్క్రీన్ మీద కనిపించకపోయినా అలా వదిలేయడం అంటే, రజనీ లాంటి సీనియర్ మరియు అనుభవం పండిన నటుడికి తెలియకుండా, ప్రమేయం లేకుండా జరిగే పని కాదని, రజనీ అనుమతి లేకుండా ఇది జరగదన్నది సినిమా జనాల అభిప్రాయం. అంటే రజనీ, థాను కలిసే చాలా ప్లాన్డ్ గా ఈ సినిమాలో పదుల కోట్ల లాభాలు చేసుకుని వుంటారని టాక్ వినిపిస్తోంది. 

పైగా అనారోగ్యంతో అమెరికా వెళ్లిన రజనీ సినిమా విడుదల అయిన రెండోరోజు వరకు అక్కడే వుండిపోవడం కూడా వెల్ ప్లాన్డ్ అని టాక్. కావాలని సినిమా విడుదల అవుతుందా? కాదా? డబ్బింగ్ వుండిపోయింది..ఇలా రకరకాల కథనాలు వినిపించి, సినిమాకు గ్రాడ్యువల్ గా భయంకరమైన హైప్ రప్పించారని, విడుదల కు రెండు రోజుల ముందే సినిమా చూడగలిగిన రజనీ, అప్పుడే ఇండియాకు రాకపోవడం అంటే కేవలం అప్పుల తలకాయనొప్పలు బయటకు వచ్చి, కబాలి విడుదల కష్టాల్లో పడకూడదనే అని వినిపిస్తోంది. పాపం కబాలి సమయంలోనైనా తన బాకీలు వస్తాయని కొచ్చెడియాన్ బాధితులు ఆశ పెట్టుకున్నారు అవి నెరవేరలేదు. ఆంధ్రలో ఇంటింట పాపులర్ అయిన లక్ష్మీ గణపతి ఫిలింస్ సంస్థనే లేకుండా చేసేసింది కొచ్చెడియాన్.

పెద్దాయిన, అనారోగ్యంతో ఆసుపత్రి లో వున్నారు, ఇలాంటి సమయంలో అప్పుల గొడవలు వద్దు అని చాలా మంది సర్దుకున్న సంగతి తెలిసిందే. ఇదే కనుక రజనీ విడుదలకు ముందే ఇండియాకు వచ్చి వుంటే పరిస్థితి ఎలా వుండేదో? నిజంగా రజనీకి తన సినిమా తన అభిమానుల కోలాహలం నడుమ విడుదల అయ్యేటపుడు మాతృదేశంలోనే వుండాలనుకుంటే, విదేశంలో సినిమా చూసిన నాటికే ఇక్కడికి వచ్చి వుండేవారు. అంతకు ముందు అక్కడ ఆశ్రమాలు తిరగేవేళకే వచ్చి వుండేవారు. కానీ అలా రాలేదు అంటే కారణం, ఇక్కడ సమస్యలు చుట్టుముట్టడానికి అవకాశం ఇవ్వకూడదని అలా చేసారని టాక్ వినిపిస్తోంది. 

ఇప్పుడు కబాలి పరిస్థితి తెలిసిపోయింది కాబట్టి, మరే పాత బాకీ వ్యవహారాలు ఇక బయటకు రావు. పైగా కబాలి వ్యవహారాలే వాటికి తోడు అవుతాయి. అందుకే ఇక రజనీ వచ్చేసారు. ఇక రోబో 2 హడావుడి ప్రారంభమవుతుంది. అయితే రోబో 2 తీస్తున్న సంస్థ ది చిన్నా చితక వ్యవహారం కాదు. అందువల్ల ఈ బాకీల వ్యవహారం తో దానికి వచ్చే సమస్య వుండదు. అంటే రజనీ తాలూకా బాకీలు రేపు..అని గోడమీద రాసుకోవాల్సిందే.

Show comments