నంద్యాలలో మత రాజకీయం షురూ చేసిన చంద్రబాబు..!

ఈ ఏడాది ఇఫ్తార్ విందు.. నంద్యాలలో ఇస్తున్నారట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దానికి గానూ ప్రభుత్వ ఖజానా నుంచి రమారమీ కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇదీ కథ.

మొత్తం వ్యవహారాన్ని ఇట్టే అర్థం చేసుకోవడానికి. ఎప్పుడూ లేనిది ఇఫ్తార్ విందు ఇలా నంద్యాల బాట పట్టడం ఎందుకో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

త్వరలో నంద్యాల ఉప ఎన్నికలు.. అక్కడ ముస్లింలు పెద్ద ఎత్తున ఉన్నారు. గెలవాలంటే వారి మద్దతు ఎంతైనా అవసరం. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందును నంద్యాలకు మళ్లించారని విశ్లేషకులు అంటున్నారు. ఒకరకంగా చంద్రబాబు చేస్తున్నది మత రాజకీయమే అని వీరు అభిప్రాయపడుతున్నారు. 

ముస్లింలను ఆకట్టుకోవడానికి బాబు ఈ ప్రయాస పడుతున్నారని అంటున్నారు. ముస్లింల ఓట్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు పెడుతున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇఫ్తార్ విందుకు రమారమీ కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు.. ఉప ఎన్నికల వేదికలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించి... అటు స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి చేసే పనిలో ఉన్నాడు చంద్రన్న అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు తెలంగాణ ఇఫ్తార్ విందు రాజకీయాలపై కోర్టు వరకూ వెళ్లాయి వ్యవహారాలు. ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం పండగ చేయడం పై వ్యవహారం కోర్టుకు చేరింది.

అంత స్థాయిలో కాకపోయినా.. కోటి రూపాయలతో నంద్యాల వేదికగా ఏపీలో మత రాజకీయం జరుగుతోంది. దాచుకోవడం ఏమీ లేకుండా.. ఏపీ ప్రభుత్వం వ్యహరిస్తోంది. మరి ఈ ఇఫ్తార్ విందుతో ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడతాయేమో చూడాలి.

Show comments