రఘురామ హోం మినిస్టర్ ట!

ఉండిలో గెలుపు ఆశలు ఎంతవరకూ ఉన్నాయో తెలియదు కానీ రఘురామ క్రిష్ణం రాజు హోం మినిస్టర్ అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు జాతి పౌరుషానికి ఆయన ప్రతీక అని కీర్తిస్తున్నారు. విశాఖ, విజయనగరంలో రఘురామ హల్ చల్ చేశారు. మీడియా ముందుకు వచ్చి జగన్ పని అయిపోయింది అని పెద్ద నోరు చేసుకున్నారు.

మే 13న వైసీపీకి జనాలు సమాధి కట్టారని జూన్ 4న పెద్ద కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.  వైసీపీకి  ఇంత సమాధి కట్టినా టీడీపీ కూటమికి మాత్రం ఆయన 125 సీట్లనే ఇచ్చారు. మరి అక్కడికీ యాభై సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పకనే చెప్పేసారు అని అంటున్నారు.

వైసీపీ పని అయిపోయింది అంటూనే యాభై సీట్లు ఇవ్వడం అందునా వైసీపీ రాజకీయ మరణాన్ని గత నాలుగేళ్ళుగా కోరుకునే అసలు సిసలు రాజకీయ శత్రువు నోటి నుంచి రావడం అంటే వైసీపీ గెలిచినట్లే అని వైసీపీ నేతలు రివర్స్ లో ఎటాక్ చేస్తున్నారు.

రఘురామ వైసీపీని ధీటుగా ఎదిరించారు అని విశాఖలో కొందరు ఆయన అభిమానులు సన్మానం చేశారు. రఘురామ కాబోయే హోం మంత్రి అని వారు ముందే చెప్పేశారు. రఘురామ హోం మంత్రి అయితేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని అభిమాన సంబరంతో వారు అంటున్నారు. Readmore!

రఘురామ ఉత్తరాంధ్రలోని గుళ్లూ గోపురాలు ఈ సందర్భంగా తిరిగారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారిని కూడా అర్చించుకున్నారు. తనకు రెండేళ్ళుగా ఈ ప్రాంతాల వైపు రావడం వీలు పడలేదని జగన్ పెట్టిన నిర్బంధం వన్ల్లనే ఇలా జరిగిందని ఆయన విమర్శించారు. 

మరో పది రోజులలో జగన్ పాలన అంతం అవుతుందని చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పాలన మొదలవుతుందని జోస్యం చెప్పారు. రఘురామ జోస్యం పవర్ ఎంత అంటే ఆయన నేనే నర్సాపురం ఎంపీని అని చెప్పినట్లేనా అని వైసీపీ నేతలు ఎకసెక్కం చేస్తున్నారు. రఘురామ హోం మంత్రి ప్రకటనలు మాత్రం అసలైన టీడీపీ నేతలకు కొంత కలవరం పుట్టించేవే అంటున్నారు.

Show comments