సల్మాన్ ఖాన్ ఇంట్లో షారూక్ పాగా

ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే దక్కుతుందంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ప్రస్తుతం షారూక్ ఖాన్ నివశిస్తున్న భారీ భవంతి మన్నత్, నిజానికి అతడు ఉండాల్సిన ఇల్లు కాదు. అది సల్మాన్ ఖాన్ సొంతం చేసుకోవాల్సి ప్రాపర్టీ. చివరికి షారూక్ కు దక్కింది.

ఈ ఆసక్తికర విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా బయటపెట్టాడు. చాలా ఏళ్ల కిందట 'మన్నత్' అమ్మకానికొచ్చింది. ఆ ఆఫర్ ముందుగా సల్మాన్ కే వచ్చింది. ఆ టైమ్ లో సల్మాన్ దగ్గర బాగా డబ్బులున్నాయి. దీంతో వెంటనే ప్రాపర్టీ కొనేందుకు ఓకే చెప్పాడు.

అయితే సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ దీనికి అభ్యంతరం చెప్పారు. అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటావ్ అంటూ ప్రశ్నించారట. దీంతో సల్మాన్ ఖాన్ మన్నత్ ను వదులుకోవడం ఆ వెంటనే షారూక్ దాన్ని కొనుగోలు చేయడం చకచకా జరిగిపోయాయి.

నిజానికి మన్నత్ ను కొనుగోలు చేసేంత డబ్బు ఆ టైమ్ లో షారూక్ దగ్గర లేదంట. అప్పటివరకు సంపాదించిన మొత్తంలో చాలా డబ్బును మన్నత్ కొనుగోలుకు ఖర్చు చేశాడట కింగ్ ఖాన్. ఇంటీరియర్ డిజైనర్ ను పెట్టుకుంటే డబ్బు ఖర్చు అవుతుందని, తన భార్యకే ఆ పని అప్పగించాడట. అలా గౌరీఖాన్, ఇంటీరియర్ డిజైనర్ గా మారారంట.

Readmore!

ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే ఓ సింగిల్ బెడ్ రూమ్ తీసుకున్నాడు సల్మాన్. గెలక్సీ అపార్ట్ మెంట్ లో ఉన్న అ సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లోనే ఇప్పటికీ నివశిస్తున్నాడు. తనకు చిన్న ఇల్లు సరిపోతుందని, మన్నత్ లాంటి పెద్ద ఇల్లు తనకు అనవసరం అంటున్నాడు సల్మాన్. ప్రస్తుతం 'మన్నత్' మార్కెట్ విలువ 200 కోట్ల రూపాయలు.

Show comments

Related Stories :