జగన్ వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి

జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాత్రమే. ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు చాలా మందే ఉన్నారు. అయినా కేవలం జగన్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. 

కారణం సోనియా గాంధీ మాత్రమే. ఆమె జగన్ ను టార్గెట్ చేయడంతో జనం "అయ్యో పాపం జగన్" అంటూ అతని వైపు వచ్చేశారు. అలా జగన్ కు అధికారం దక్కింది. (తన సొంత కష్టం, కృషి కూడా తోడయ్యాయి అనుకోండి.) 

ఇప్పుడు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5... ఇలా అందరూ కలిసి జగన్ పై మూకుమ్మడి దాడి చేస్తుంటే జనం మరోసారి "అయ్యో పాపం జగన్" అనేస్తున్నారు. ఒక్కడిపై ఇంతమంది దాడా! అని జనం ఆశ్చర్యపోతున్నారు. 

జగన్ కు అధికారం రావడానికి పరోక్షంగా సోనియా గాంధీ కారణం అయితే, ఆ అధికారం నిలబెట్టుకోడానికి ఇప్పుడు ఇంతమంది పరోక్షంగా కారణం కాబోతున్నారు. 

కాబట్టి యేతా, వాతా చెప్పేదేమంటే జగన్ వీళ్ళందరి ఫోటోలు పెట్టుకోవాలి.  

కనీసం రామోజీరావు, రాధాకృష్ణ ఫోటోలు అయినా పెట్టుకోవాలి. 

జగన్ పై వీళ్ళు నిత్యం చేస్తున్న దాడి తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు కూడా చేయలేకపోతున్నారు. అలా ఈ ఇద్దరూ జగన్ పదవి పదిలంగా ఉండేందుకు పరోక్షంగా కృషి చేస్తున్నారు. 

అందుకే కనీసం ఈ ఇద్దరి ఫోటోలు అయినా జగన్ పెట్టుకోవాలి.

Facebook post by Gopi Dara

Show comments