జగన్ దార్శనికత భేష్

జగన్ లో గొప్ప దార్శనికుడు ఉన్నాడని, ఆయన ఇవాళా రేపూ కాకుండా భవిష్యత్తు తరాల‌ గురించి ఆలోచన చేస్తున్నారని మేధావులు సహా అంతా అంటున్న మాటగా ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఆలోచనలు అన్నీ తాత్కాలికంగా ఉంటాయి. కానీ రాజనీతి కోవిదుడుగా మారితేనే విప్లవాతమైన నిర్ణయాలు వస్తాయి.

అలాంటి నిర్ణయాలు జగన్ కేవలం ఏడాది కాలంలోనే తీసుకున్నారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అంటున్నారు. జగన్ ఏడాది పాలనను విశ్లేషించిన ఈ సీనియర్ మోస్ట్ రాజకీయ నేత తాను ఇంత స్పీడ్ గా వరస నిర్ణయాలు కేవలం ఇంత తక్కువ టైంలో తీసుకోవడం ఎక్కడా చూడలేదని అన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదన దేశానికే ఆదర్శమని కూడా దాడి పేర్కొనడం విశేషం. ఇప్పటికి ఏడు దశాబ్దాల‌ అంధ్రుల చరిత్రలో అనేక చోట్ల  తిరిగి విడిపోయిన సందర్భాలు ఉన్నాయని, భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా చూడడమే జగన్ ఉద్దేశ్యమని దాడి అంటున్నారు.

మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక ఉద్యమాలకు చెక్ పెట్టవచ్చునని ఆయన  అభిప్రాయపడ్డారు. ఇక ఒక్క ఏడాదిలో 90 శాతం పైగా హామీలను తీర్చిన ఘనత కూడా దేశంలో ఒక్క జగన్ కే దక్కుతుందని దాడి విశ్లేషించారు. మొత్తానికి ఎన్టీయార్ హయాంలో మంత్రిగా పనిచేసిన దాడి లాంటి వారు జగన్ ముఖ్యమంత్రిత్వాన్ని, ఆయన సాహస  నిర్ణయాలను మెచ్చుకోవడం అంటే విశేషంగానే చూడాలి.

లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

Show comments