గ్యారేజ్ పై డబుల్ టాక్

ఏదో మరి కాస్త డబ్బులు వస్తాయని చూస్తే, అసలుకే ఎసరు వచ్చేలా చేస్తున్నాయి ప్రీమియర్ లు, బెనిఫిట్ షోలు. తెల్లవారకుండానే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోతోంది. సినిమా బాగుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే నెగిటివ్ ఫ్యాన్స్ చేసే ఫోన్లు, వాట్సప్ మెసేజ్ లు ఇన్నీ ఇన్నీ కావు. బాహుబలి నుంచి జనతా గ్యారేజ్ వరకు దీన్ని తప్పించుకున్నవి లేవు. 

జనతా గ్యారేజ్ గొప్ప సినిమా కాదు. అందులో అనేకానేక లాప్స్ లు వున్నాయి. అది వాస్తవం. అయితే తెల్లవారుఝామున సినిమా ముగిసిన తరువాత వచ్చిన టాక్ రేంజ్ వేరు. అది ఎలా వుందీ అంటే ఇక జనతా గ్యారేజ్ అనే సినిమా సాయంత్రానికి థియేటర్లలోంచి లేచిపోతుంది అన్న రేంజ్ లో. సినిమా అమ్మిన రేంజ్, కలెక్షన్లు ఎలా వుంటాయి, ఏ మేరకు నష్టాలు, లాభాలు అన్నది పక్కన పెడితే, అసలు సినిమాను పట్టుమని రెండు మూడు రోజులు కూడా వుండే పరిస్థితి లేకుండా చేసే ప్రయత్నం జరిగినట్లు స్పష్టంగా కనిపించింది. 

కొందరేమో తెలుగుదేశం వర్గాలు ఎన్టీఆర్ అంటే కిట్టక చేసాయి అంటున్నారు. కొందరేమో, పవన్ ఫ్యాన్స్ చేసారు ఇదంతా అంటున్నారు. ఏది నిజమో మరి. కానీ  తీరా చేసి, వన్ డే దాటిన తరువాత రియల్ టాక్ స్ప్రెడ్ కావడం మొదలైంది. సినిమా మరీ డిజాస్టర్ కాదు, ఎంటర్ టైన్ మెంట్ మిస్సయింది అంతే అన్న టాక్ వినిపించడం ప్రారంభించింది. 

హీరో ఎంట్రీ లేటు కావడం, హీరోయిన్లను పక్కన పెట్టేయడం, ఫన్ అన్నది మిస్ కావడం జరిగిందని, అయితే మరీ థియేటర్లలోంచి వన్ టు డేస్ కే లేపేయాల్సిన సినిమా కాదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇక కలెక్షన్ల సంగతి చూస్తే, ఫస్ట్ డే, ఆల్ టైమ్ రికార్డుల సంగతి అలా వుంచితే, సెకెండ్ డే మార్నింగ్ షోలు కూడా స్టడీగానే వున్నాయి. మిగిలిన షోలకు అడ్వాన్స్ బుకింగ్ లు బాగానే వున్నాయి. దీంతో యూనిట్ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.

Show comments