బిగ్ బాస్ గట్టిగానే నిలబడ్డాడు

మొదటి ఎపిసోడ్ కు అదిరిపోయే రేటింగ్ వస్తే అంతా గాలివాటం అన్నారు. అది వాపు మాత్రమే బలుపు కాదన్నారు కొందరు. ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ ను ఆమాత్రం చూడరా ఏంటని మరికొందరు పెదవి విరిచారు. రాబోయే రేటింగ్ ఢమాల్ అవుతుందని కొందరు ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు. కానీ ఎన్టీఆర్ స్టామినా బుల్లితెరపై స్టాండర్డ్ గా నిలిచిపోయింది. బిగ్ బాస్ రియాలిటీ షో, రెండో వారం కూడా రేటింగ్స్ లో అదరగొట్టింది.

ఎన్టీఆర్ కనిపించే వీకెండ్ ఎపిసోడ్స్ లో రికార్డు రేటింగ్స్ సాధించింది బిగ్ బాస్. ఆదివారం (23-07-17)కు అత్యథికంగా 12.3 టీఆర్పీ వచ్చింది. ఇక వీకెండ్ యావరేజ్ టీవీఆర్ 12.1గా ఉంది. బిగ్ బాస్ చలవతో జీఈసీ (జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్) విభాగంలో ఇప్పటికే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న స్టార్ మా ఛానెల్.. వరుసగా రెండో వారం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

వీకెండ్స్ తో పాటు సాధారణ రోజుల్లో కూడా బిగ్ బాస్ కు రేటింగ్స్ తెప్పించేందుకు ప్లాన్-బి అమలు చేస్తోంది సదరు ఛానెల్. ఇప్పటికే దీక్ష పంత్ అనే హాట్ భామను రంగంలోకి దించింది. ఈ భామ మొదటి రోజే స్విమ్మింగ్ పూల్ లో దిగి హల్ చల్ చేసింది.

Show comments