రావణాసురుడిగా రానా

జస్ట్ 2 రోజుల కిందటే ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రావణాసురుడి పాత్ర గురించి మాట్లాడాడు రానా. "రామాయణం లాంటి ఓ గొప్ప కథ చెబుతున్నప్పుడు, రావణాసురుడి లాంటి పాత్ర చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అలాంటి పాత్రలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేయలేం." అని రెస్పాండ్ అయ్యాడు. రానా ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన కొన్ని గంటలకే రామాయణం ప్రాజెక్టు ఎనౌన్స్ అయింది.

అల్లు అరవింద్ నిర్మాతగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రామాయణం ప్రాజెక్టు ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో రాముడిగా ఎవరు నటిస్తారనే విషయాన్ని పక్కనపెడితే, రావణాసురుడి పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

ఇప్పటికే భయంకర భళ్లాలగా తనలోని విలనిజం యాంగిల్ ను చూపించిన రానా, రావణాసురుడి పాత్రకు పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక్కడే మరో లాజిక్ ను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రాబోతోంది కాబట్టి.. ఈ మూడు భాషలకు కనెక్ట్ అయిన రానానే రావణాసురుడి పాత్రకు సరిపోతాడని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి ప్రకటనకే పరిమితమయ్యారు నిర్మాత అల్లు అరవింద్. ఈ ప్రాజెక్టు దర్శకుడు ఎవరు..? రామలక్ష్మణుల పాత్రలు ఎవరు వేస్తారు..? లాంటి విషయాల్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. మరి రావణాసురుడి డిస్కషన్ ఈ నిర్మాత వరకు వెళ్లిందో లేదో..!

Show comments