మైండ్ బ్లాక్ అవుతుందని మోదీ వివరాలు దాచారా!

రెండేళ్ళలో ప్రధాని మోదీ తిరిగిన  దేశాలు 51 మరి ఖర్చు...? ఆ వివరాలు వెల్లడించడానికి మాత్రం పీఎంవో సుముఖంగా లేనట్లుంది. లేదా, ఆ ఖర్చులు కూడా జనం గుండెలు బద్ధలవుతాయని భయపడుతున్నట్లుంది. ‘అందుకే ఇంకా లెక్కతేల్చలేదు’ అని సమాచార హక్కు మార్కు సమాధానంతో తప్పించుకుంటోంది. జనాన్ని బురిడీ కొట్టించడంలో తనను మించిన వారు లేరని మోడీ చాలా రకాలుగా నిరూపించుకున్నారు.. జనం అడిగిన వివరాలు కూడా చెప్పకుండా మరో  రకంగా బురిడీ కొట్టిస్తున్నారు. 

అదే ఇతరుల మీద వేలెత్తి చూపడానికి మాత్రం అత్యుత్సాహం కనబరుస్తున్నారు. గత ప్రధాని మన్మోహన్ దశాబ్ద కాలంలో విదేశి పర్యటన కోసం ఖర్చు పెట్టిన వివరాలు అంకెలతో సహా  ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. మన్మోహన్ 73 పర్యటనల్లో 95 దేశాలు చుట్టి వచ్చారు. అందుకు అయిన ఖర్చు రు.795.17 కోట్లు. సమాచార హక్కు ద్వారా అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు ఇవి. 

నరేంద్ర మోదీ 2014 మే 26న ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ గారు 24 విదేశీ పర్యటనల్లో 51 దేశాలు చుట్టి వచ్చారు. మరి ఖర్చెంత అంటే, మోదీ పర్యటన బిల్లులు కొలిక్కి రాలేదని పీఎంవో సమాచారం. కొలిక్కి రాలేదా లేక కంగారు పుట్టించే లెక్కలు ఉన్నాయా? మన్మోహన్ సింగ్ పదేళ్లలో 95 దేశాలు తిరిగేయగా, మోడీ రెండున్నరేళ్లలో 51 దేశాలు టూర్ చేయడం చిన్న విషయం కాదు. ఈ లెక్కన మిగిలిన రెండున్నరేళ్లలో మన్మోహన్ స్కోరును క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు. 

మన్మోహన్ ది ఏముండేది పాపం.. నీలిరంగు టర్బయిన్, ఒకేమాదిరిగా కనిపించే బంద్ గలా సూటు.. అక్కడితో ఆయన ఆహార్యం పూర్తయ్యేది. కానీ.. విదేశీ టూర్లలో ఉన్నప్పుడు ఒక రోజుకు మూడు, నాలుగు సార్లు డ్రస్సులు మార్చి.. జనం ద్రుష్టిలో అదికూడా ఒక రకంగా చర్చనీయాంశం అయ్యేలా పుష్కలమైన హంగుఆర్భాటాలతో వెళ్లే మోడీకి ఇంకా బీభత్సమైన ఖర్చు అయిఉంటుందనేది అందరూ ఊహించదగినదే. అందుకే పీఎంఓ ఆ కర్చుల్ని వెల్లడించడం లేదేమో అని అనుకుంటున్నారు. 

దిల్లీ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబాను కల్సినప్పుడు మోదీ వేసుకున్న సూటు వివాదాలకు దారి తీస్తే దాన్ని 4.31 కోట్లకి వేలం వేయించి గిన్నీస్ బుక్ రికార్ద్ లోకి ఎక్కించి  ఆ వేలం లో లభించిన మొత్తాని గంగా ప్రక్షాళన కార్యక్రమానికి విరాళం ఇచ్చి ఆ రకంగా కూడా తనకు ప్రచారాన్ని సంపాదించుకున్నారు మోడీ.. అలాంటిది.. అంత వివరణ ఇస్తూ విషయాలు వెల్లడించగా లేనిది విదేశి పర్యటన ఖర్చుల వివరాలు కొలిక్కి రాలేదని చెప్పడం వింతగా ఉండడమే కాదు, అనుమానాల్ని రేకెత్తించేలా ఉంది. మనకి పనికి వచ్చేది గోరంతైనా కొండంత చేసి చెపుతాం, దానికి ఎంత ఖర్చు చేసైనా సరే, అదే ఖర్చుల వివరాలు అడిగితే మాత్రం... ష్ గప్ చుప్!

Show comments