భరత్ అనే నేను- మహేష్ టైటిల్

జనతా గ్యారేజ్ టైటిల్ ప్రకటించినపుడు జనానికి భలే ఆశ్చర్యం. దటీజ్ కొరటాల అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ డివివి దానయ్య తన సినిమా కోసం భరత్ అనే నేను టైటిల్ రిజిస్టర్ చేసే సరికి భలే హడావుడి.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో ది ముఖ్యమంత్రి క్యారెక్టర్ అన్నది తెలిసిందే. రాజకీయ పదవీ ప్రమాణ స్వీకారంలో ....అనే నేను అనే పదం సూపర్ పాపులర్. ఇప్పుడు కొరటాల దాన్నే టైటిల్ గా తీసుకున్నాడు.

భరత్ అనే నేను..అన్న టైటిల్ కచ్చితంగా మాంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో వుందని చెప్పుకోవాల్సిందే. దానయ్య నిర్మించే ఈ సినిమా 2017 లో ప్రారంభమై ఇయర్ ఎండింగ్ వేళకు విడుదలకు సిద్దమవుతుందని తెలుస్తోంది.

Readmore!
Show comments

Related Stories :