మెగా బ్రదర్స్ వన్ హవర్ మంతనాలు?

ఇద్దరు అన్నదమ్ములు ముచ్చటించుకోవడంలో, మంతనాలు జరపడంతో వింతేమీ లేదు. కానీ మెగా బ్రదర్స్ చిరు అండ్ పవన్ ఓ గంట సేపు భేటీ వేసి ముచ్చటించుకున్నారు అంటే అది కచ్చితంగా విశేషమే. ఎందుకంటే ఒకాయిన కాంగ్రెస్ కంపెనీలో స్లీపింగ్ పార్టనర్. మరొకాయిన తెలుగుదేశం స్పాన్సర్డ్ బ్రాండ్ న్యూ కంపెనీకి సిఇఓ. ఒకటి కుడివైపు చూస్తే, రెండవది ఎడమవైపు చూసే వ్వవహారం. మరి అలాంటి ఇద్దరు కలిసి ఒక గంట ముచ్చట్లాడుకున్నారు అంటే అది కాస్త విశేషమే.

అన్న మెగాస్టార్ తన ఖైదీ నెం  150 వ సినిమా షూట్ ను తమ్ముడు పవన్ కాటమరాయుడు సెట్ లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా అన్న తమ్ముడు ఓ దగ్గర చేరారు. ఇది చాలా రేర్ అకేషన్. ఫోన్ ల్లో ఎప్పుడు మాట్లాడుకుంటారో అన్నది పక్కన పెడితే, ఇలా ముఖాముఖి కలవడం కాస్త తక్కువే అని అందరికీ తెలుసు. ఆ మధ్య బ్రూస్ లీ పరాజయం తరువాత హుటాహుటిన పవన్ తన గబ్బర్ సింగ్ గెటప్ లో అన్న ఇంటికి వచ్చి, కలిసి వెళ్లారు. మళ్లీ తరువాత ఇదే అనుకోవాలి. 
ఈ మధ్యకాలంలో చాలా పరిణామాలు సంభంవించాయి.

పవన్ రాజకీయంగా మెలమెల్లగా క్రియాశీలకం అవుతున్నారు. చిరు తన 150 వ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రామ్ చరణ్ స్వంత నిర్మాణ సంస్థను స్థాపించారు. మరోపక్క చిరు కాంగ్రెస్ నుంచి భాజపాలోకో, తేదేపాలోకో వెళ్తారని వందతులు వున్నాయి. పవన్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగుతుందని టాక్ వుంది. మరి ఇలా ఇన్నింటి నడుమ ఈ ఇద్దరు ఓ గంట ముచ్చటించుకున్నారు అంటే కాస్త ఆసక్తి కరమే. కానీ ఏయే విషయాలపై ముచ్చటించుకుని వుంటారన్నది ఆ ఇద్దరికే తప్ప వేరెవరికి తెలియదు కదా?

Show comments