రానా వర్సెస్‌ ఎన్టీఆర్‌: ఎవరిది పైచేయి.?

బుల్లితెరపై ఓ వైపు రానా, ఇంకో వైపు ఎన్టీఆర్‌ సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్‌ 'బిగ్‌బాస్‌' షోతో సందడి చేయనుండగా, రానా 'నెంబర్‌ వన్‌ యారీ విత్‌ రానా' అంటూ బుల్లితెరపైకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహజంగానే, ఈ ఇద్దరిలో ఎవరు బుల్లితెరపై తమదైన ప్రత్యేకతను చాటుకుంటారు.? అన్న చర్చ జరుగుతోంది టాలీవుడ్‌ సర్కిల్స్‌. 

'నెంబర్‌ వన్‌ యారీ' అనేది జస్ట్‌ ఓ టాక్‌ షో మాత్రమేనన్న ప్రచారం జరుగుతోంది. టాక్‌ షోలో ఏముంటుంది.? సెలబ్రిటీల విశేషాలే ఇక్కడ మెయిన్‌ ఎలిమెంట్స్‌. కాస్తంత ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం డాన్సులు, జోకులు.. ఇలాంటివన్నీ వుండొచ్చు.

బిగ్‌బాస్‌ షో అలాంటిది కాదు. దాని కిక్కే వేరప్పా. కొంచెం థ్రిల్లింగ్‌గా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందిది. అయితే, రానా మహా మాటకారి. ఈ విషయంలో ఎన్టీఆర్‌ని తక్కువ అనలేంగానీ, ఆ మాటకారితనాన్ని బుల్లితెరపై ఎన్టీఆర్‌ ప్రదర్శించింది చాలా అరుదు. రానాకి అయితే ఇలాంటి విషయాల్లో కాస్తంత అనుభవం వుందనే చెప్పాలి. 

'బాహుబలి' తెచ్చిన స్టార్‌డమ్‌తో రానా, టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో నెంబర్‌ వన్‌ రేసులో తనదైన ప్రత్యేకతను ఎప్పుడో నిరూపించుకున్న ఎన్టీఆర్‌.. బుల్లితెరపై సందడి చేస్తున్నారంటే, ఈ రెండు ప్రోగ్రామ్స్‌పైనా బుల్లితెర ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ పీక్స్‌లో వుంటుంది. అంచనాల విషయంలో ఎన్టీఆర్‌దే పై చేయి. మరి, ప్రోగ్రామ్‌ని రక్తి కట్టించడంలో ఎవరిది పై చేయి అవుతుంది.? వేచి చూడాల్సిందే.

Show comments