ఆ ప్రకటనపై కమల్ కు కోపం వచ్చింది!

లేటు వయసులో వారి అనుబంధం మొదలు కావడమే చాలా ఆశ్చర్యకరంగా మొదలైంది. వాళ్లిద్దరి సహజీవన వార్తలు వచ్చినప్పుడు సగం సమాజం ఆశ్చర్యపోయింది. అయితే పిల్లల విషయంలో వారి ప్రకటనలు మాత్రం అభినందనలు అందుకున్నాయి. గౌతమి తొలి వివాహం ఫలితంగా కలిగిన కూతురుతో సహా తనకు మొత్తం ముగ్గురు పిల్లలుఅని కమల్ వ్యాఖ్యానిస్తే.. కమల్ కూతుళ్లు ఇద్దరితో సహా తనకు ముగ్గురు అమ్మాయిలున్నారని అనుకుంటానని అప్పట్లో గౌతమి ప్రకటించింది.

మరి ఇప్పుడు తన కూతురు భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమి ఈ బాంధవ్యం నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. మరి తనవంతు గా గౌతమి విషయాన్ని బ్లాగులో పోస్టు చేసింది. ఇంతకీ కమల్ వెర్షన్ఏమిటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

ఇలాంటి నేపథ్యంలో కమల్ ప్రకటన అంటూ ప్రచారంలోకి వచ్చిన ఒక నోట్ అసలు కమల్ విడుదల చేసినది కాదట! ఈ విషయాన్ని తెలుపుతూ.. ఆ నోట్ ను ప్రచారంలోకి తెచ్చిన వారిపై కమల్ విరుచుకుపడ్డాడు. తన స్పందన అంటూ నకిలీ సమాచారాన్ని ప్రచురించడాన్ని కమల్ ‘అనాగరిక  చర్య’ గా అభివర్ణించాడు. తను ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని కమల్ స్పష్టం చేశాడు.

మరి ఇంతకీ ఏముందా ప్రకటనలో అంటే.. నెగిటివ్ గా ఏమీ లేదు. బంధం విడిపోవడాన్ని కమల్ స్వాగతిస్తున్నట్టుగా, గౌతమి ఆమె తనయకు తన ఆశీస్సులు ఉంటాయని కమల్ పేర్కొన్నట్టుగా ఉంది ఆ ప్రకటన. మరి పాజిటివ్ గానే ఉన్నా.. తన పేరుతో అలాంటి ప్రకటన రావడంపై కమల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు! 

Show comments