రాజమౌళి-మహేష్ పక్కా అంట

ఎప్పటి నుంచో వినిపిస్తున్న కాంబినేషన్ ఇది. కానీ అలా వార్తల్లోనే వుంటూ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో, సూపర్ డైరక్టర్ రాజమౌళి సినిమా అన్నది వుంటుందా? వుండదా? అని చిన్న అనుమానం. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా వుండదు కానీ, రాజమౌళి ఓ సినిమా చేసిన తరువాత మహేష్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

మహేష్ తో రాజమౌళి సినిమా చేయడానికే నిర్మాత కేఎల్ నారాయణ అడ్వాన్స్ ఇచ్చారని, రాజమౌళి ఆ మాట నిలబెట్టుకుంటాడని అంటున్నారు. అయితే ముందుగా డివివి దానయ్య కమిట్ మెంట్ ఫినిష్ చేసి, అప్పుడు ఈ సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తోంది.

రాజమౌళి తను ఇప్పుడు ఈరేంజ్ కు వచ్చాను కదా? అని గతంలో ఇచ్చిన మాట తప్పే రకం కాదని, కచ్చితంగా, డివివి దానయ్య, కెఎల్ నారాయణ కమిట్ మెంట్ లు ఓకె చేస్తారని, అయితే వాళ్లకు సోలోగానే చేస్తారా? ఎవర్నయినా కలుపుతారా? అన్న దాంట్లో క్లారిటీ లేదని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది.

ఆరునెలల తరువాత రాజమౌళి సినిమా స్టార్ట్ అవుతుందని, అప్పటికి కథ రెడీ కావాల్సి వుందని, దాన్ని బట్టే హీరో డిసైడ్ అవుతారని అంటున్నారు. ఇప్పటికి అయితే నిర్మాతలు ఇద్దరు పక్కా కానీ, సబ్జెక్ట్ ఇంకా డిస్కషన్ లోకే రాలేదని తెలుస్తోంది.

Show comments