బ్రాహ్మణులకు సినీ బ్రాహ్మణులు శత్రువులా!

‘నేనూ బ్రాహ్మణుడినే..’ అని కుండబద్దలు కొట్టేశాడు హరీష్ శంకర్. డీజే సినిమా విషయంలో తలెత్తిన వివాదాన్ని వదిలించుకోవడానికి ఈ దర్శకుడు తన చివరి అస్త్రం ప్రయోగించాడు. అసల డీజే సినిమా విషయం వివాదాన్ని పెంచి పోషించడానికి మురుగు సమాజం చానల్ అవిశ్రాంతంగా పని చేస్తోంది.

అందరికీ నీతులు చెప్పడం  తను మాత్రం పెంట పనులు చేయడం ఆ చానల్ కు అలవాటే కదా. ఇప్పుడు డీజే విషయంలో కూడా ఆ చానల్ పెంట పెంట చేస్తోంది. పొద్దస్తమానం ఈ వివాదాన్ని కెళుకుతోంది.

మరి ఆ చానల్ సంగతలా ఉంటే.. హరీష్ శంకర్ ‘మేము కూడా బ్రహ్మణులే సుమా..’ అని చెప్పేసిన వైనాన్ని గమనిస్తే.. ఇక్కడ కొన్ని విషయాలను గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో బాపనయ్యలకు బాగా కోపం తెప్పించిన సినిమాల వెనుక బ్రహ్మణులే ఏదో విధంగా ముఖ్య పాత్రలు పోషించడం.

‘అదుర్స్’, ‘దేనికైనా రెడీ’ సినిమాలపై బ్రాహ్మణ వర్గాలు ఫైర్ అయ్యాయి. ఆయా సినిమాల్లో బ్రహ్మణులను, బ్రాహ్మణుల సంప్రదాయాలను కించపరిచారనే వివాదాలు రేగాయి. ఆ సినిమాలపై నిరసన తెలుపుతూ బాపనయ్యలు రోడ్డు ఎక్కారు కూడా. దేనికైనా రెడీ సినిమా వ్యవహారం అయితే తీవ్ర వివాదం గా మారింది.

మరి అదే సినిమాకు రచయితల్లో బాపనోళ్ల హవా ఉంది. ఆ సినిమాకు పని చేసిన కోన వెంకట్ రాష్ట్రంలోనే ప్రముఖ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాగే అదుర్స్ లో బ్రహ్మణుల భావోద్వేగాల సరదాసరదా గా పండించడంలోనూ కోన వెంకట్ దే ముఖ్య పాత్ర.

దేనికైనా రెడీ విషయంలో కోనతో పాటు మరో బ్రాహ్మణ రచయిత కూడా పని చేశాడు. అయినప్పటికీ అది తీవ్ర వివాదానికి దారి తీసింది. మరి ఇప్పుడు మరో వివాదం రేగినప్పుడు కూడా బ్రాహ్మణుడే వార్తల్లో నిలుస్తున్నాడు. మరి బ్రాహ్మణులకు సినీ బ్రాహ్మణులు శత్రువులా ఏంటి?

Show comments