దాసరి మృతిపై నాకు అనుమానం ఉంది : రాజశేఖర్

వేరే ఎవరైనా ఈ వ్యాఖ్యలు చేస్తే అంతగా పట్టించుకోనక్కర్లేదు. సంచలనం కోసం మాట్లాడారేమో అనుకోవచ్చు. కానీ రాజశేఖర్ దీనికి మినహాయింపు. ఎందుకంటే స్వతహాగా రాజశేఖర్ డాక్టర్. మెడికల్ విషయాల్లో ఆచితూచి మాట్లాడే వ్యక్తి.

సినీ పరిశ్రమలో చాలా మంది పెద్దలకు అప్పుడప్పుడు వైద్యసాయం కూడా అందించారు. ఇలాంటి వ్యక్తి దాసరి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. 

చనిపోవడానికి కొన్ని నెలల ముందు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దాసరిని తను చూశానని చెబుతున్నాడు రాజశేఖర్. ఏ వ్యక్తి ఆరోగ్యమైనా క్రమంగా క్షీణిస్తుంది తప్ప, హఠాత్తుగా మరణం వరకు వెళ్లదని అంటున్న రాజశేఖర్.. వైద్యం అందించే విషయంలో ఎక్కడో పొరపాటు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

75 ఏళ్ల వయసుకే దాసరి చనిపోతారని తను అస్సలు ఊహించలేదని, ఎందుకంటే దాసరిని రెగ్యులర్ గా కలిసే వ్యక్తుల్లో తను కూడా ఒకడినని, అనారోగ్యంతో ఆయన్ని ఎప్పుడూ చూడలేదంటున్నాడు రాజశేఖర్.

మరోవైపు బరువు తగ్గేందుకు దాసరి శస్త్రచికిత్స చేసుకున్నారని, కానీ అది ఫెయిల్ అయిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. బహుశా ఆ ఫెయిలైన సర్జరీ వల్ల వచ్చిన సమస్యలతోనే దాసరి తొందరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఉండొచ్చు.

ఏదేమైనా దాసరి మృతిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం అప్రస్తుతం. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవల్ని స్మరించుకోవడమే ఉత్తమం.

Show comments