కన్నుకొట్టి చూసెనంట సుందరి

శర్వానంద్-కాజల్-కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా రణరంగం. ఓ మాఫియా డాన్ బయోపిక్ లాంటి సినిమా. సాహో వెనక్కు జరగడంతో ఆ డేట్ ను అక్వైర్ చేసిన రణరంగం ప్రమోషన్లను షురూ చేసింది. ఓ మాంచి పాటను విడుదల చేసింది. ఇప్పటికే ఓ పాట విడుదల చేసారు. ఇది రెండోసాంగ్.

'కన్ను కొట్టి చూసేనంట సుందరి... మనసు మీటి వెళ్లేనంట మనోహరి' అంటూ హీరో హీరోయిన్ ను ఉద్దేశించి పాడే పాట ఇది. గీత రచయిత కృష్ణచైతన్య రచించగా, చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రి గ్రూజ్ ఆలపించారు. కార్తీక్ స్వరం తెలుగు ఆడియన్స్ కు కాస్త కొత్తగా, డిఫరెంట్ గా వినిపిస్తుంది. అలాగే ట్యూన్ కూడా వైవిధ్యంగా వుంది. అందువల్ల ఓ కొత్తతరహా పాటను వింటున్న ఫీల్ కలుగుతుంది.

సినిమాలో పాటలు అన్నీ బాగా వచ్చాయని, కొత్త తరహా సంగీతం సినిమాలో వినిపిస్తుందని, సినిమాకు అడియో మంచి ప్లస్ అవుతుందని నిర్మాత నాగవంశీ రెండోపాట విడుదల సందర్భంగా అన్నారు. త్వరలో మరిన్ని పబ్లిసిటీ మెటీరియల్ ను అందిస్తామని, ట్రయిలర్ ను వచ్చేనెల మొదటివారంలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..