బాబాయ్ తో నేను: కల్యాణ్ రామ్ భావోద్వేగం

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫస్ట్ లుక్స్ వచ్చాయి. తాజాగా కల్యాణ్ రామ్ లుక్ ను కూడా విడుదల చేశారు. సినిమాలో తండ్రి హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషిస్తున్నాడు. ఆ పాత్ర స్వభావాన్ని, తీరుతెన్నుల్ని వివరించేలా ఓ లుక్ విడుదల చేశారు. 

ఈ స్టిల్ లో హరికృష్ణ పాత్రధారి కల్యాణ్ రామ్ ను వెనక నుంచి చూపించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు, ప్రచారం చేసినప్పుడు చైతన్యరథానికి డ్రైవర్ గా ఎనలేని సేవలందించారు హరికృష్ణ. అప్పటి చైతన్యరథం రామకృష్ణా స్టుడియోస్ లో ఇప్పటికీ ఉంది. అక్కడ తీసిన స్టిల్ నే కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు.

"30 ఏళ్ల కిందట మా బాబాయ్ తో బాలగోపాలుడు అనే సినిమాలో బాలుడిగా నటించాను. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా. బాబాయ్ వాళ్ల నాన్నగారిలా, నేను మా నాన్నగారిలా.."

ఇలా ఎంతో భావోద్వేగంతో ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు కల్యాణ్ రామ్. తండ్రి హరికృష్ణ మరణించిన తర్వాత, ఏకంగా తండ్రి పాత్రలో కనిపించడం నిజంగా కాకతాళీయం. హరికృష్ణకు సీనియర్ ఎన్టీఆర్ దిశానిర్దేశం చేసేలా ఉంది ఈ స్టిల్.

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్, చంద్రబాబు, ఏఎన్నార్, శ్రీదేవి లుక్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు హరికృష్ణ లుక్ కూడా విడుదల చేశారు. దీంతో సినిమాకు సంబంధించి కీలకమైన గెటప్స్ అన్నీ దాదాపు బయటకు వచ్చేసినట్టయింది.

Show comments