ఫ్యాన్స్ కోసం డీజే డబుల్ ధమాకా

టాలీవుడ్ లో ఆడియో రిలీజ్ లు ఆపేసి, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టిందే మెగా కాంపౌండ్. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా నుంచే ఈ కల్చర్ ప్రారంభమైంది. అప్పట్నుంచి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారంతా.

పాటల్ని యూట్యూబ్ లో రిలీజ్ చేసి, సినిమా విడుదలకు వారం ముందు గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేస్తున్నారు. అయితే డీజే సినిమాతో బన్నీ ఇప్పుడు రెండూ చేయబోతున్నాడు.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించి పాటల విడుదల వేడుకతో పాటు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 11వ తేదీ ఆదివారం రోజున డీజే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు.

ఇప్పటికే యూట్యూబ్ లో 2 పాటలు రిలీజ్ కాగా, మిగిలిన పాటల్ని ఆడియో ఫంక్షన్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

ఆదివారం ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత మరో ఆదివారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టాలని అనుకుంటున్నారు. అంటే 11వ తేదీ ఆడియో రిలీజ్, 18న ప్రీ-రిలీజ్ ఫంక్షన్, 23న సినిమా రిలీజ్ అన్నమాట.

Show comments