సమంత ఆరాటం, చైతన్య ఆలస్యం

ఎలాగో తమ పెళ్లి గురించిన న్యూస్ ఇపడు అఫీషియల్ అయిపోయింది కదా అని సమంత తమ ప్రైవేట్ ఆట పాటలకి సంబంధించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో పెడుతోంది. చైతూని పెళ్లి చేసుకోవాలనే ఆరాటంతో సమంత కొద్ది నెలలుగా కొత్త సినిమాలు సైన్ చేయడమే మానేసింది.

ఆల్రెడీ ఒపకున్న సినిమాలు కూడా వదిలేసుకుని మరీ చైతన్యతోనే మొత్తం సమయం గడపాలని సమంత చూస్తోంది. సమంత ఇలా పని మానుకుని మరీ పెళ్లి కోసం ఆరాట పడుతోంటే, చైతన్య మాత్రం అదే పనిగా కొత్త సినిమాలు సైన్ చేస్తున్నాడు.

ఎపడంటే అపడు పెళ్లికి రెడీ అన్నట్టు సమంత కూర్చుని ఉంటే, ఇపడే తొందర లేదంటూ చైతన్య తన పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. తనకంటే ముందు తమ్ముడి పెళ్లి అయిపోయినా ఫర్వాలేదని చైతన్య తన పెళ్లి వచ్చే ఏడాదికి నెట్టాడు. మరోవైపు సమంతని సినిమాలు మానేయమని తాను చెప్పలేదని, తను పెళ్లి తర్వాత నటించాలని అనుకున్నా తనకి అభ్యంతరం లేదని అంటున్నాడు. అయినప్పటికీ సమంత మాత్రం కొత్త సినిమాలు ఓకే చేసే ప్రసేక్త లేదంటూ భీష్మించుకు కూర్చుంది.

Show comments