సావిత్రికి జెమిని గణేషన్ కావలెను

సావిత్రి బయోపిక్ పనులు ఊపందుకున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ సినిమాలో కీలక పాత్ర అయిన సావిత్రిగా నటించబోతోంది. మరో కీలక పాత్రను సమంత పోషిస్తోంది. అయితే అన్నింటికి మించి నటి సావిత్రి జీవితంలో కీలకపాత అలనాటి నటుడు జెమిని గణేషన్ ది. మరి దీనికి సరైన నటుడు కావాలి. 

దానికోసమే ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ వేట సాగిస్తున్నారు. సినిమాకు మరింత వెయిట్ రావాలంటే దానికి సరైన నటుడు దొరకాలి. సావిత్రి - జెమిని గణేషన్ మధ్య సంబంధాలు, భావోద్వేగాలు, అన్నీ పండాలంటే అందుకు తగ్గ నటుడు వుండాలి. అది కూడా కాస్త పాపులర్ నటుడై వుండాలి. 

ఈ దిశగా ఎవరు సూటవుతారు అనే విషయమై మల్లగుల్లాలు పడుతూ, ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను తమిళ, తెలుగు భాషల్లో తీస్తున్నందున, జెమినీగా తమిళ నటుడైతే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే జీవితకథ కాబట్టి, ఎక్కడ ఏ తేడా వుంటుందో అని ఆ పాత్ర చేయడానికి చాలా మంది ముందుకు రాకపోవచ్చు. పైగా అన్ని షేడ్ లు పండించాలి. ఏజ్డ్ లుక్ కూడా అవసరం అవుతుంది. ఇవన్నీ చాలా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. 

అందువల్ల నాగ్ అశ్విన్ ఏం చేస్తారో చూడాలి.

Show comments