బాబు తప్పు చేసారా?

తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు, ఆ పార్టీతో వర్గ ప్రయోజనాలు ఆశించి, సదా మద్దతు పలికేవారు కూడా ఇప్పుడు ఆఫ్ ది రికార్డుగా చంద్రబాబు తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పోయి పోయి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని వారు లోపాయికారీగా కామెంట్ చేస్తున్నారు. పవన్ వ్యూహాలు తెలుస్తూ కూడా, ఆయనను తన పక్కనే వుంచుకునే ప్రయత్నం చేయడం ఆది నుంచి తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్న ఓ వర్గానికి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ వర్గం, ఇది బాబు కోరి చేసుకున్నది అని లోపాయికారీగా కామెంట్ చేస్తున్నారు.

జల్లికట్టు టైమ్ లో పవన్ ట్వీట్ చేసినపుడే బాబు ఏదో ఒకటి చేసి పవన్ ను వెనక్కు లాగి వుండాల్సింది. కానీ ఊరుకున్నారు. కానీ అక్కడే చిన్న ట్విస్ట్. జగన్ తక్షణం పవన్ కు మద్దుతు పలికి బాల్ ను నేరుగా అవతలి కోర్టులోకి సెర్వ్ చేసారు. దీంతో పవన్ తన ట్వీట్ ల యుద్దాన్ని కొనసాగించక తప్పలేదు.

జగన్ మరి కొంచెం ముందుకు వెళ్లి వైజాగ్ వెళ్తా అన్నారు. అప్పుడే అర్థం అయిపోయింది. పవన్ వెళ్లరు అని. కానీ తాను వెళ్లని ఇంపాక్ట్ కనిపించకూడదని పవన్ మరిన్ని ట్వీట్ లు చేస్తున్నారు. దీంతో ఇటు జనసేన, అటు వైకాపా రెండూ ఒక పక్క నిల్చున్నట్లు అయింది. తెలుగుదేశం పార్టీ జనాలు నేరుగా వైకాపాను మాత్రం టార్గెట్ చేస్తున్నా, పవన్ చేస్తున్న పని తెలుస్తూనే వుంది.

అయినా పవన్ ను టార్గెట్ చేయవద్దని బాబు లోపాయికారీగా పార్టీ జనాలకు చెప్పడం కూడా తెలుగుదేశం పార్టీ కి సదా మద్దతు పలికే వర్గానికి మింగుడు పడడం లేదు.. పవన్ అంత డైరక్ట్ అటాక్ చేస్తుంటే ఊరుకోవడం అంటే, సరి అయిన వ్యూహం కాదని, వారి ఫీలవుతున్నారు. పవన్ చేస్తున్న దాడి, చంద్రబాబు అండ్ కో అతన్ని వదిలి వైకాపాను టార్గెట్ చేయడం చూసి కాపు యువత, తమనాయకుడికి  మాటలతో అయినా టచ్ చేయడానికి బాబు అండ్ కో భయపడుతున్నారన్న ఫీల్ కు వస్తున్నాయి. ఇది కచ్చితంగా విధాన లోపం అని తెలుగుదేశం మద్దతు వర్గం ఫీలవుతోంది. 

Show comments