ఇక్కడ నడుస్తున్నది బాబుుస్వామ్యం

వినేవారు వుండాలే కానీ ఎన్నయినా చెప్పొచ్చు..రాసి అచ్చోసే మన పత్రికలు వుండాలే కానీ ఎన్ని స్టేట్ మెంట్ లు అయినా ఇవ్వొచ్చు.అవి లాజిక్ లకు అందినా? అందకున్నా? పోనీ అలా అని మన మీడియా అడుగుతుందా? ఇది ఎలా కరెక్ట్? మీకు గిట్టని వాళ్లందరినీ ఇలా ఏదో ఒంకతో లోపల పడేయడం సరేనంటారా? అని నిలదీస్తుందా? పొరపాటున కూడా అలా చేయదు.

ఇదంతా మహిళా పార్లమెంట్ సదస్సు సంగతే. స్వర్ణభారతి పేరిట భారీగా విరాళాలు తీసుకుంటూ, ట్రస్ట్ ను కూడా దిగ్విజయమైన వ్యాపారంగా నడుపుతున్న వెంకయ్య నాయుడు కుమార్తెను ఆహ్వానించారు. వెంకయ్య కుమార్తె కాకుంటే, ఆ ట్రస్ట్ ఆ రేంజ్ లో వుండేదా? పవన్ కళ్యాణ్ నే అన్నారు స్వయంగా. వెంకయ్య ఆ ట్రస్ట్ మీద పెట్టిన శ్రద్దను రాష్ట్రం మీద పెట్టాలని. 

ఎమ్మెల్యే రోజాను పార్లమెంట్ సదస్సులో గొడవ చేస్తుందనే అనుమానంతో అరెస్టు చేసాం. ఇది పోలీసుల మాట. పోలీసులు మంచి పని చేసారు. లేదూ అంటే గొడవ చేసేది..అప్పుడు ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చేది..ఇది చంద్రబాబు మాట.

ఎక్కడన్నా లాజిక్ కు అందుతున్నాయా? ఈ మాటలు. జరుగుతున్నది భారీ సదస్సు. ఎంత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా రోజా ఏం చేస్తుంది అక్కడ? ఏ విధమైన రగడ? మహా అయితే తన ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను ఎండగొట్టడం ఒక్కటే రోజా చేయగలగిన పని. అంతకు మించి అక్కడ అంతమంది హేమా హేమీల మధ్యలో రోజా ఏం రగడ చేయగలదు? ధర్నా చేస్తుందా? నిరసన చేసేదా? అసలు పోలీసులకు అందిన సమాచారం ఏమిటి? అది నిజమా? కాదా? నిర్థారణ ఎలా చేసుకున్నారు? Readmore!

ఈ లెక్కన ఎవర్నయినా? ఎక్కడయినా అరెస్టు చేయచ్చు. అదేమని ప్రశ్నిస్తే, మీరు గోడవ చేయబోతున్నారని సమాచారం అందింది అని ఒక్క ముక్క చెప్తే చాలు. మరి ఇలాంటి పరిస్థితిని ఎమర్జెన్సీ అంటారా? మరేమన్నా అంటారా? ఇంత నిస్సిగ్గు, నిర్దయపాలన ఎక్కడన్నా వుంటుందా?

ఇంతకు మించి చిత్రమేమిటంటే..ఇదే సదస్సుకు వచ్చిన ఎంపీ కవిత ప్రత్యేక హోదా మీద చేసిన కామెంట్ తెలుసు. దానిపై థాంక్స్ చెప్పడమూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుసు. కానీ ఇదే సదస్సు నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాకు జరిగిన అవమానం కానీ, అప్రజాస్వామ్యక వ్యవహారం కానీ పవన్ బాబుకు తెలియదు. దానిపై కామెంట్ చేయాలనీ తెలియదు. ఏం చేస్తాం..రాష్ట్రంలో నడుస్తున్నది బాబు స్వామ్యం మరి.

Show comments

Related Stories :