గని వాయిదా పడిపోయినట్లేనా?

వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన సినిమా గని. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. కానీ అఖండ సినిమా విడుదలకు డేట్ ప్రకటించడంతో గని సినిమాను మూడు వారాలు వాయిదా వేసారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అసలు డిసెంబర్ నెలలో విడుదల అనుమానంగా వుంది. 

ఇప్పటికే డిసెంబర్ రెండో వారంలో రెండు సినిమాలు ప్రకటించేసారు. ఆ తరువాత వారం పుష్ప సినిమా భారీగా విడుదల వుంది. 

డిసెంబర్ ఆఖరి వారంలో శ్యామ్ సింగరాయ్ వుంది. ఇలాంటి టఫ్ కాంపిటీషన్ సిట్యువేషన్ లో రావడం కన్నా వాయిదానే బెటర్ అనే భావనలో వుంది గని సినిమా.

పైగా గని సినిమాను ఇప్పుడు విడుదల చేయాలంటే బయ్యర్లు, అమౌంట్లు అడ్జస్ట్ కావడం కాస్త కష్టమే. అందుకే జనవరి నెల మూడో వారానికి వాయిదా వేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

మ్యూజిక్ డైరక్టర్ థమన్ కూడా గని ఈ నెలలో వచ్చే అవకాశం తక్కువ అని చెప్పడం విశేషం.

Show comments