పవన్ గైర్హాజరు ఖరీదు ఎంత?

పెద్ద సినిమాల షూటింగ్ లకు ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది. ఒక నటుడు రాకపోయినా, షూటింగ్ అప్ సెట్ అయపోతుంది. దాని ఫలితం లక్షల్లో వుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ సినిమా షూట్ లో అలాగే  జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పైగా ఇలా గైర్హాజరు అయింది ఎవరో కాదు. సాక్షాత్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే. కారణం ఏమిటి అన్నది తెలియదు. నిర్మాత, డైరక్టర్ అడిగే సాహసం కూడా చేయరనుకోండి. అది వేరే విషయం.

ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసారు. సాధారణంగా సెట్ వేస్తున్నపుడు అద్దెలు, ఖర్చులు ఓ రేంజ్ లోనూ, వేసిన తరువాత మరో రేంజ్ లోనూ వుంటాయి. అందువల్ సెట్ పూర్తయిన తరువాత చకచకా పని కానిచ్చేసుకోవాల్సిందే.

అయితే వున్నట్లుండి అయిదు రోజుల పాటు పవన్ షూట్ కు రాలేదని తెలుస్తోంది. దాంతో షూట్ ను క్యాన్సిల్ చేయక తప్పలేదు. తీరాచేసి ఒక రోజు సాయంత్రం తాను మర్నాటి నుంచి షూటింగ్ కు వస్తున్నానని పవన్ కబురు చేసారట.

ఇక అప్పుడు యూనిట్ ఉరకలు పరుగులు పెట్టింది. ముఖ్యంగా పవన్ తో చేయాల్సిన సన్నివేశాల్లో కమెడియన్ శ్రీనివాసరెడ్డి వుండాలి. కానీ ఆయన ఈ అయిదు రోజులు ముగిసాక, వేరే సినిమా మీదకు వెళ్లారని వినికిడి. దాంతో ఆయన అక్కడి నుంచి రాలేని పరిస్థితి. దాంతో మరో మూడు రోజులు షూట్ నిలిచిపోయిందని తెలుస్తోంది. 

అంటే టోటల్ గా ఎనిమిది రోజులు షూట్ నిలిచిపోయిందని రూమర్ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో మరి? నిజమైతే మాత్రం ఎనిమిది రోజుల పాటు అన్నపూర్ణ స్డూడియో ఫ్లోర్ కు రెంట్, మళ్లీ అదనపు కాల్ షీట్లు అంతా కలిపి లక్షల్లోనే వుంటుంది వ్యవహారం.

Show comments