వెటకారం కాదు.. బన్నీ వల్లే డీజే బాగా వచ్చింది

ఓ నటుడి నుంచి హండ్రెండ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ రాబట్టడంలోనే దర్శకుడి టాలెంట్ ఉంది. మరి దర్శకుడి టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టే బాధ్యత ఎవరిది..? ఆ పని నిర్మాత చేస్తాడా, హీరో చేస్తాడా..? అసలు దర్శకుడి టాలెంట్ ను బయటకు తీయడం ఎలా? ఇలాంటివి నేర్చుకోవాలంటే బన్నీ దగ్గర కోచింగ్ తీసుకోవాల్సిందే. బన్నీ కేవలం నటించడు. దర్శకుడికి కూడా కోచింగ్ ఇస్తాడు. ఈ విషయాన్ని డీజే దర్శకుడే చెబుతున్నాడు.

డీజే సినిమాకు సంబంధించి హరీష్ శంకర్ కేవలం లైన్ మాత్రమే అనుకున్నాడట. తర్వాత దిల్ రాజుతో సంప్రదించి ఎలాగోలా స్క్రీన్ ప్లే పూర్తిచేశాడట. కానీ టోటల్ సినిమాకు ఓ షేప్ తీసుకొచ్చింది మాత్రం బన్నీనే అంటున్నాడు హరీష్ శంకర్. ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే పవన్ సినిమాల విషయంలో ఎలా "ఎక్కువ" చొరవ చూపిస్తాడో.. డీజే విషయంలో బన్నీ అదే చేశాడని చెప్పకనే చెప్పాడు.

"బన్నీ తనకు ఏం కావాలో నా నుంచి రాబట్టుకున్నాడు. ఇందులో తిరుగేలేదు. నా టాలెంట్ మొత్తం ఉపయోగించుకున్నాడు. బన్నీ వల్ల డీజే స్క్రిప్ట్ చాలా బెటర్ అయింది. ఇది వెటకారం కాదు." హరీష్ శంకర్ యాజ్ ఇటీజ్ గా చెప్పిన మాటలివి.

నిజమే ఇది వెటకారం కాదు.. సినిమా స్క్రీన్ ప్లే నుంచి డైరక్షన్ వరకు ప్రతి విషయంలో బన్నీ మార్క్ ఉంది. అన్ని విభాగాల్ని బన్నీ స్వయంగా చూసుకున్నాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలకు రీషూట్లు చెప్పింది కూడా బన్నీనే. ఓవరాల్ గా ఇది అల్లు అర్జున్ సినిమా.

Readmore!

Show comments

Related Stories :