వినేవాడుంటే ..చెప్పేవాడు చంద్రబాబు

వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు... ఏపిలో సరదాగా వినిపిస్తున్న మాట ఇది. ఇదేదో సామెతలాగుంది అనుకుంటున్నారు కదూ. ఈ మధ్య చంద్రబాబు చెబుతున్న మాటలు విన్న వారికి ఇలా అనిపించడం సహజమే.

స్వచ్చ భారత్ కార్య క్రమలో శుక్రవారం మాట్లాడుతూ ఏపినే దేశంలో ఫస్ట్ అన్నాడు. అది ఏ మేరకు నిజం అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మరేమన్నారు..త్వరలో ఏపికి అయిదు లక్షలకోట్లు పెట్టుబడులు, పదిలక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అన్నారు. ఇది విన్నవారికి మతి పోయినంత పనయింది. అధికారంలోకి రాగానే బాబు వస్తే జాబు వస్తుంది అన్న మాట ఇప్పటకి ఒక్క అడుగు ముందుకు పడలేదు. 

జాబు వచ్చే దాకా నిరుద్యోగ భృతి అన్నారు అదీ ఇప్పటి వరకు లేదు. అదికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతూనే ఉన్నారు. పవర్ లోకి వచ్చినప్పటి నుంచి ఏపిలో ఉన్నది తక్కువ, సింగపూర్,జపాన్, చైనా, అమెరికా అంటూ విదేశాల్లో ఉన్నది ఎక్కువ పైగా ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా పోయింది. ఇప్పుడు కూడా ఈ మాట అంటే ఎవరైనా సరే ఏమనుకుంటారు చెప్పండి.

అక్కడితో ఊరుకున్నారా... మరో మాట అన్నాడు. అప్పట్లో ప్రధాని వాజ పేయికి బ్యాండ్ విడ్త్ గురించి కూడా తానే చెప్పానన్నాడు.  బాబు చెప్పడంతోనే దానిపై కమిటీ వేసారట వాజ్ పేయి. సరేలే ఇందులో నిజమెంతో చెప్పాలంటే వాజ్ పేయ్ నోరు విప్పాలి. 

ఏమిటో. ఇలా ప్రతీదీ తన ఖాతాలో వేసుకునే రాజకీయ నాయకులను ఏమంటారో?వారికి ఏమన్నా సమస్య ఏమో?. 

Show comments