బాలయ్య.. పవన్‌ అవకాశాలనూ దెబ్బ తీస్తున్నాడా?

మరీ ఇంత తెగింపు ఏమిటో.. ఆఖరికి దున్నపోతుల మీద బాలయ్య పేరు, తెలుగుదేశం పార్టీ పేర్లను రాసి నిరసన తెలిపారు. బాలయ్య నియోజకవర్గం వైపు చూడలేదు.. కనీసం నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఏవైనా చర్యలు చేపడుతున్నట్టుగా కలరింగ్‌ కూడా ఇవ్వలేదు. బాలయ్య అంటే సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఆయన బదులు తెలుగుదేశం పార్టీ అయినా హిందూపురం పరిధిలో ఏవైనా కార్యక్రమాలు చేపట్టి జనాలను కూల్‌ చేసే పని చేపట్టిందా? అంటే.. అదీ లేదు.

తెలుగుదేశం పార్టీ తీరును చూసినా, బాలయ్య వ్యవహారం గమనించినా.. పూర్తిగా తెగించేసినట్టుగా కనిపిస్తున్నారు. జనాలకు వీళ్లు ఏమాత్రం భయపడటం లేదు. బహుశా వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలయ్యను పోటీ చేయించాలని అనుకుంటున్నారో లేదో కానీ.. వీళ్ల తీరు పవన్‌ కల్యాణ్‌పై కూడా ప్రభావం చూపించేలా ఉంది.

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ అనౌన్స్‌ చేశాడు. మరి సినిమా హీరోకి ఓట్లు వేస్తే పరిస్థితి ఎలా తయారవుతుందో హిందూపురంను గమనిస్తున్నారు అనంత ప్రజలు.

సినిమా వాళ్లు ఎన్నికల ముందు రెన్నాళ్లు హడావుడి చేసి వెళతారు తప్ప.. తర్వాత వాళ్లతో ఉపయోగం శూన్యం అని జనాల్లో ఒక అభిప్రాయాన్ని బలపరుస్తోంది తెలుగుదేశం పార్టీ. బాలయ్య తీరును గమనించి.. పవన్‌ను ఎన్నుకున్నా అలాంటి పరిస్థితే తప్పదనే భావనే జనాలపై ప్రభావం చూపిస్తే.. సినీ హీరో అనేది యాంటీ సెంటిమెంట్‌గా మారుతుందేమో!

Show comments