అరగంట చాలదు 'వంగా'?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన పద్దతి పూర్తిగా మార్చేసారు. లైన్ చెబితే, అరగంట నెరేషన్ ఇస్తే సినిమా చేసే పద్దతికి స్వస్తి చెప్పేసారు. అందుకే డైరక్టర్లు అంతా కిందామీదా అవుతున్నారు. ఈలోగా ఫీలర్లు బయటకు వదులుతున్నారు. దాంతో మహేష్ కు, నమ్రతకు కూడా చికాకు కూడా వస్తోందని వినికిడి.

డైరక్టర్ వంగా సందీప్ తో మహేష్ సినిమా అన్న గ్యాసిప్ బయటకు రావడం మహేష్ ను, నమత్రను చాలా ఇరిటేట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు, ఆ సంగతే లేకుండా ఈ వార్తలేమిటని నమ్రత  ఎంక్వయిరీ చేసినట్లు బోగట్టా.

వాస్తవానికి వంగా ఓ అరగంట నెరేషన్ ఇచ్చినట్లు బోగట్టా. దానికి మహేష్, అరగంట నెరేషన్ చాలదని, పూర్తి స్క్రిప్ట్ ఎవరు చెబితే వారితోనే సినిమా అని క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ కు కూడా ఈ విధమైన క్లారిటీ ఇచ్చినట్లు వినికిడి. గతంలో ఇలా అరగంట నెరెషన్ లు విని సినిమాలు చేసి దెబ్బతినడంతో, ఇకపై మూడు గంటల నెరేషన్, పూర్తి స్క్రిప్ట్ తెచ్చేదాకా సినిమా ఓకె చేసేది లేదని, మహేష్ ఫిక్స్ అయినట్లు బోగట్టా.

రీలు లేదు.. రిలీజు లేదు మహేష్ తో సినిమా
రాను రాను ఎలా తయారైందీ అంటే వ్యవహారం. అదిగో హీరో అంటే ఇదిగో సినిమా అని, ఇదిగో సినిమా అదిగో నిర్మాత అని అన్నట్లుగా వుంది. సమస్య ఏమిటంటే, ఎవరికీ ఏ కాంట్రాక్టులు వుండవు. కానీ తెలిసినట్లు బిల్డప్పులు మాత్రం వుంటాయి. హీరో మహేష్ బాబు ఒకటి రెండు కాదు మూడు నాలుగు కమిట్ మెంట్లతో వున్నాడు నిర్మాతలకు అది వాస్తవం. కానీ ఆయనకు ఓ ఆర్డర్ అంటూ వుండదు. 

కొరటాల శివ దొరికారు వెంటనే భరత్ అనే నేను పట్టాలు ఎక్కింది. సుకుమార్ హిట్ కొట్టారు మహర్షి సినిమా తరువాత ప్లేస్ ఇచ్చేసారు. అలా వుంటుంది. వ్యవహారం. రేపు సుకుమార్ సినిమా పూర్తయ్యేలోగా ఏ కొరటాలో? ఇంకెవరో వస్తే, అటు వెళ్లిపోతుంది సినిమా. 

ఇలాంటి నేపథ్యంలో గీతాఆర్ట్స్, సందీప్ వంగా సినిమా అంటూ భలే జోక్ లాంటి గ్యాసిప్ పుట్టింది. గీతాఆర్ట్స్ లో మహేష్ సినిమా అన్నది జస్ట్ ఓ మాటగా పుట్టింది. అరవింద్ తాను ఓ సినిమా చేద్దాం అనుకుంటున్నా అంటే మహేష్ అలాగే అన్నాడు. అదీ విషయం అంతకు మించి అంగుళం కదల్లేదు.

ఇక సందీప్ వంగా సంగతి కూడా అలాంటిదే. ఆయనకు వుండే కమిట్ మెంట్లు ఆయనకు వున్నాయి. మైత్రీకి కూడా ఓ సినిమా చేయాలి. ఆసియన్ సునీల్ కు ఓ సినిమా చేయాలి. అసలు గీతాకు మహేష్ సినిమా అనేది ఇప్పట్లో జరిగేది కాదు. ఎందుకంటే అంతకు ముందు మహేష్ కు బోలెడు కమిట్ మెంట్లు వున్నాయి. అవన్నీ ఫినిష్ చేయాలి.

అదీకాక, గీతాకు చేయాలా? వద్దా? అన్నది ఇంకా మహేష్, నమ్రతలకు క్లారిటీ లేదని తెలుస్తోంది. కానీ ఈలోగా గ్యాసిప్ లు మాత్రం పుట్టేసాయి.