నెక్ట్స్ సినిమా గురించి, మరీ ముఖ్యంగా బంగార్రాజు ప్రాజెక్టు గురించి అడిగినప్పుడు నాగ్ రియాక్షన్ ఇది. మొన్నటివరకు రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పనుల్లో బిజీగా ఉన్న తను ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోలేదని, అమలతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లి రిలాక్స్ అవుతానని ప్రకటించాడు నాగ్.
అయితే బంగార్రాజు సినిమా ఇప్పట్లో రాదనే విషయం నాగ్ మాటల్లో స్పష్టమైంది. ఎందుకంటే ఆ సీక్వెల్ కు సంబంధించి దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇప్పటివరకు కథ కూడా రాయలేదట. అందుకే టైటిల్ రిజిస్టర్ చేయించినా కూడా సినిమాను ఎనౌన్స్ చేయలేకపోతున్నామన్నాడు నాగార్జున.
బంగార్రాజు సినిమా ఇప్పట్లో రాకపోవచ్చని చెప్పడానికి మరో 2 రీజన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి రాజుగారి గది-2. హాలిడే ట్రిప్ తర్వాత ఆ సినిమాను కంప్లీట్ చేస్తానని ప్రకటించాడు నాగ్. ఆ తర్వాత కొన్ని రోజులు తన సినిమాల్ని పక్కనపెట్టి, అఖిల్-విక్రమ్ కుమార్ సినిమాపై ఫోకస్ పెడతానని తెలిపాడు. అఖిల్ సినిమాకు కూడా నాగార్జునే నిర్మాత.
సో.. బంగార్రాజు ఇప్పట్లో తెరపైకి రాడని తేలిపోయింది. అయితే కొసమెరుపేంటంటే.. కల్యాణ్ కృష్ణ ఇప్పటివరకు కథ రాయలేదని నాగ్ చెబుతున్నప్పటికీ.. రారండోయ్ సినిమా కంటే ముందు బంగార్రాజు కోసం 2-3 స్టోరీలైన్స్ అనుకున్నాడు కల్యాణ్ కృష్ణ. కాకపోతే అవేవీ నాగార్జునకు నచ్చలేదు. అందుకే విషయం మళ్లీ మొదటికొచ్చింది.