‘నారాయణ’లో ఎన్నో కుసుమాలు రాలాయి.. ఇప్పుడు ఆయనింట్లో..

ఇప్పుడు నారాయణ తనయుడు మరణించాడని.. మీడియా వాపోతోంది కానీ, ఇదే సందర్భంలో కొన్ని గుర్తు చేయాల్సిన అంశాలను ప్రస్తావించాలి. ఏ విద్యా సంస్థల అధినేతగా నారాయణ పరిచయస్తుడో, ఏ విద్యా సంస్థల అధినేత గా వ్యాపార వేత్తగా పేర్గాంచి.. ఆయన రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించేంత వరకూ వచ్చారో.. ఆ విద్యా సంస్థల్లో జరిగిన ఎన్నో విషాద సంఘటనలు కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి.

ఇప్పుడు నారాయణ దంపతుల గర్భశోకం గురించి సానుభూతి వెల్లువెత్తుతోంది. కానీ.. ఇదే సానుభూతి చాలా సంవత్సరాలుగా నారాయణ విద్యాసంస్థల్లో మరణిస్తూ వచ్చిన పసిపిల్లల విషయంలో వెల్లువెత్తలేదు ఎందుకనో! వాళ్లవి ప్రాణాలు కావా?

ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా… గర్భశోకం ఎవరిదైనా శోకమే కదా.. ఒకరాఇద్దరా, నారాయణ విద్యాసంస్థల్లో మరణించిన పసిపిల్ల సంఖ్య ఎంతని చెప్పేది? బహుశా కొన్ని వందల మంది!

వీటిలో చాలా అనుమానాస్పద మరణాలు ఉన్నాయనేది నిష్టూర సత్యం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల మరణాల పట్ల తీవ్రమైన విషాదంతో అనుమానాలను వ్యక్తం చేశారు కూడా. పిల్లలు మంచాలకు ఉరి వేసుకుని మరణించారని నారాయణ యాజమాన్యం చెబితే.. అదే నిజం అయిపోయింది.

మరి ఆ సంఘటనలకూ, ఇప్పుడు నారాయణ తనయుడి మరణానికి ఎలాంటి సంబంధమూ లేకపోవచ్చు గాక. కానీ  ‘గర్భ శోకం’ మాత్రం రెండు చోట్లా కామన్. ఇది మాత్రం కాదనలేని విషయం. అందుకే నివాళిఘటిద్దాం.. నారాయణ తనయుడికి, నారాయణలో రాలిన ఎన్నో కుసుమాలకూ..

Show comments