పవన్ పై అంబటి రాంబాబు పంచ్ లు!

'ఎన్నికల సమయంలో జనసేన పార్టీ విడుదల చేసిన మెనిఫెస్లో ఇరవై రెండు పేజీలుంటే.. వందరోజుల జగన్ పాలన మీద ఆయన ఇచ్చిన నివేదిక ముప్పై మూడు పేజీలుగా ఉంది..' అంటూ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై విమర్శలు సంధించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

చంద్రబాబు నాయుడి పెయిడ్ ఆర్టిస్టులా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ అంబటి ధ్వజమెత్తారు. ఎవరినో ఓడించడానికే జనసేన తాపత్రయం కనిపిస్తుంది తప్ప, సొంతంగా అధికారంలోకి రావడానికి జనసేన ప్రయత్నించదని అన్నారు. జనసేన స్వయం ప్రకాశకం కాదని, వేరే ఎవరి కోసమో పనిచేసే పార్టీ అని అన్నారు.

చంద్రబాబు నాయుడి అక్రమ కట్టడాల మీద పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు పక్కపక్కన కూర్చుని నివేదికను రాసినట్టున్నారని ఎద్దేవా చేశారు. వారి సర్టిఫికెట్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అవసరం లేదని అన్నారు.

తమకు పవన్ సర్టిఫికెట్ అవసరం లేదని, ప్రజల సర్టిఫికెట్ చాలని అంబటి వ్యాఖ్యానించారు. తాము ఎన్నేళ్లు మంచి పాలనను అందించినా.. పవన్ కల్యాణ్, చంద్రబాబులు తమను ప్రశంసిస్తారని అనుకోవడం లేదన్నారు.

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!

Show comments