ఆ హీరో సినిమాకు భారీ రేట్

మంచి కాంబినేషన్ ఉంటే, ఈ రోజుల్లో థియేటర్ రైట్స్ తో పాటు నాన్ థియేటర్ రైట్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో హిందీ డబ్బింగ్, అమెజాన్ హక్కుల రూపంలో మంచి ఆదాయం వస్తోంది. లేటెస్ట్ గా శర్వానంద్ సినిమాకు కూడా మంచి రేట్ వచ్చింది.

శర్వానంద్, సాయిపల్లవి కాంబినేషన్ లో దర్శకుడు హను రాఘవపూడి అందిస్తున్న సినిమా పడి పడి లేచె మనసు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను మా టీవీ తీసుకుంది. అలాగే హిందీ డబ్బింగ్.. అమెజాన్ స్ట్రీమింగ్ హక్కులు కూడా ఇచ్చేసారు.

ఈ మొత్తం నాన్ థియేటర్ హక్కులకు 12 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇంత మొత్తం శర్వానంద్ సినిమాకు రావడం ఇదే తొలిసారి. సినిమా బడ్జెట్ లో దాదాపు మూడు వంతులు రిటర్న్ వచ్చేసినట్లే. డిసెంబర్ 21న పడి పడి లేచె మనసు విడుదల అవుతుంది.

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్