సెంటిమెంట్: చిరుతో పోటీకి బాలయ్య రెడీ!

మాటల్లేవ్, మాట్లాడుకోవడల్లేవ్… చిరు వర్సెస్ బాలయ్య, బాలయ్య వర్సెస్ చిరంజీవి.. సంక్రాంతి సీజన్ లో పోటీకి ఇది వరకే సిద్ధం అయిన ఈ టాప్ హీరోలు.. తేదీ విషయంలో కూడా ఒకే రోజున  రావడం ఖాయం అవుతోంది. ముందుగా అనుకున్నది అయితే “గౌతమీ పుత్ర శతకర్ణి’’ జనవరి పన్నెండో తేదీన విడుదల అవుతుందన్నారు. అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు ఆ సినిమా జనవరి పదకొండే తేదీన విడుదల కానుంది!

నూటా ముప్పై నిమిషాల నిడివితో శాతకర్ణి సిద్ధం అవుతున్నాడట. ఇందులో నలభై నిమిషాల పాటు వీఎఫ్ఎక్స్ మజా ఉంటుందనే మాట వినిపిస్తోంది. శాతకర్ణిని అనుకున్న తేదీ కన్నా ఒక రోజు ముందే విడుదల చేయడానికి ఒక సెంటిమెంట్ ఉంది. జనవరి పదకొండు బాలయ్యకు కలిసొచ్చిన తేదీ.

ఆ తేదీకి కచ్చితంగా పదిహేను సంవత్సరాల కిందట నరసింహనాయుడు విడుదల అయ్యింది. బాలయ్య కెరీర్ లోఒక సంచలన విజయం సాధించిన పిక్చర్ గా నిలిచిపోయింది అది. ఈ నేపథ్యంలో వచ్చే  ఏడాది జనవరి పదకొండున బాలయ్య ప్రతిష్టాత్మక వందో సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఆ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్నాడు “ఖైదీ- నూటాయాభై’’ ఈ మేరకు చూస్తే… బాలకృష్ణ, చిరంజీవిలు తమ తమ సినిమాలతో తలపడటం ఖాయం అయినట్టే.

Readmore!
Show comments

Related Stories :