బాలయ్య తో మైత్రీ మూవీస్?

చకచకా సినిమాలు చేస్తూ, ఇంకా ఏ సినిమాలు చేయాలని చకచకా ప్లాన్ చేస్తున్న మైత్రీ మూవీస్ హీరో బాలకృష్ణ తో కూడా ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసింది. రామ్ చరణ్ సినిమా నిర్మాణంలో వుంది. నాగ్ చైతన్య, పవన్ సినిమాలు ప్రారంభం కావాల్సి వుంది. 

ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేసే ఆలోచనలో వున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణల మధ్య డిస్కషన్లు నడిచాయి. వాళ్ల కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్ చేసే ఉద్దేశంలో వున్నారు. ఇప్పుడు ఆ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం భవ్య మూవీస్ కు, సి కళ్యాణ్ కు రెండు సినిమాలు కమిట్ అయివున్నారు బాలయ్య. మూడో సినిమా మరి మైత్రీకి ఇస్తారో? ఎవరితో చేస్తారో చూడాలి. బోయపాటి అయితే డైరక్టర్ గా దాదాపు కన్ ఫర్మ్ అని వినిపిస్తోంది.

Show comments