సమంత ప్రేమ.. పబ్లిసిటీ స్టంటేనా.!

టాలీవుడ్‌ బ్యూటీ సమంత ఓ యంగ్‌ హీరోని పెళ్ళాడబోతోందంటూ చాలాకాలంగా గుసగుసలు విన్పిస్తున్నాయి. 'ఇదిగో సమంత పెళ్ళాడబోయేది ఇతన్నే..' అంటూ అక్కినేని నాగచైతన్యతో, సమంత 'స్పెషల్‌'గా మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తున్న ఫొటో బయటకు వచ్చింది. అది నిజమేనా.? అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

అయితే, సమంత మాత్రం తాను ప్రేమలో పడ్డాననీ, ప్రేమించిన వ్యక్తినే పెళ్ళాడతానని బల్లగుద్ది మరీ చెబుతుండడం గమనార్హం. ఆ పెళ్ళికొడుకు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌ అట. అన్ని వివరాలూ త్వరలో వెల్లడిస్తానంటోంది సమంత. చూస్తోంటే, ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌లా వుంది తప్ప, సమంత నిజంగానే లవ్‌లో వుందన్న విషయంలో ఏమాత్రం నిజం లేదేమో అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి. 

వాస్తవానికి సమంత గతంలోనే ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్తా అటకెక్కింది. మళ్ళీ ఇప్పుడిలా కొత్త లవ్‌ స్టోరీ షురూ చేసిందన్నమాట సమంత. టాలీవుడ్‌లో సమంతకి వున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తమిళంలోనూ ఆమెకు పాపులారిటీ వుంది. మరెందుకు, పెళ్ళి పేరుతో సమంత పబ్లిసిటీ స్టంట్స్‌ చేస్తున్నట్లు.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. సేవా కార్యక్రమాలతోనూ ఎప్పుడూ బిజీగా వుండే సమంత, ప్రేమ - పెళ్ళి అంటూ వివాదాస్పదమవుతుండడం ఆశ్చర్యకరమే మరి.

Show comments