దాసరి తో సినిమాకు పవన్ నో?

పవన్ ఇచ్చిన బోలెడు కమిట్ మెంట్లలో దర్శకుడు దాసరి నారాయణరావు నిర్మాణంలోని సినిమా ఒకటి. ఇప్పుడు ఆ సినిమా అయిడియాను పవన్ డ్రాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ దగ్గర చేస్తున్న సినిమా కాకుండా మరో మూడు కమిట్ మెంట్లు వున్నాయి. వీటిలో రెండు, హారిక హాసిని, ఎఎమ్ రత్నంల సినిమాలు 2017లో పూర్తయ్యే అవకాశం వుంది. ఆ తరువాత ఫైనల్ గా మైత్రీ మూవీస్ సినిమా. అంటే 2018 ప్రథమార్ఢంలో. ఇదంతా కూడా అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే. ఇవికాక నిర్మాత దానయ్య అడ్వాన్స్ ఒకటి పవన్ దగ్గర వుండనే వుంది.అదెప్పుడో తెలియదు. 

ఇంక అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి. పైగా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేసేలా లేదు. అందువల్ల ఇక ఈ మూడు ప్రాజెక్టులు కాక, కొత్తవి ఓకె అనకూడదని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దాసరితో ప్రాజెక్టు డ్రాప్ చేసుకుని, ఆ విషయాన్ని ఆయనకు చేరవేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల దాసరి తనతో సినిమాపై పవన్ కు కబరుచేసినట్లు, దానికి పవన్ ఈ విధంగా నెగిటివ్ సందేశం పంపించినట్లు తెలుస్తోంది. 

పైగా ఎన్నికల లోపు తనపై కాపు కుల ముద్ర ఏ విధంగానూ కూడా పడకూడదని పవన్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దాసరితో కనుక సినిమా చేస్తే, ఆ మేరకు కాస్తయినా ప్రభావం పడే అవకాశం వుంది. దాసరితో సినిమా చేయను అనడానికి ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. మొత్తానికి అన్న చిరంజీవితో లంకేశ్వరుడు (1989) సినిమా చేసిన దాసరి తమ్ముడు పవన్ తో సత్యాగ్రహి చేసే అవకాశం ఇక లేనట్లే అనుకోవాలి.

Show comments