జగన్ వదిలిన బాణాన్ని అంటున్న విజయసాయి...!

విశాఖ జీవీఎంసీ ఎన్నికలు ఒక్క లెక్కన జరుగుతున్నాయి. వైసీపీ వ్యూహాత్మకంగా ఎన్నికల సమరానికి తెర తీసింది. రోజుకు పది కిలోమీటర్లు తగ్గకుండా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  పాదయాత్ర చేస్తున్నారు. 

వార్డుల్లో కలియతిరుగుతూ సమస్యలను ఎక్కడికక్కడ గుర్తించడమే కాదు, పరిక్షారాన్ని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాను జగన్ మనిషిని అని తొలిసారిగా విజయసాయిరెడ్డి బాహాటంగా ప్రకటించారు. జగన్ పంపిస్తే తాను విశాఖ వచ్చానని ఆయన అన్నారు. విశాఖను అభివృద్ధి చేయాలన్నది జగన్ ఆలోచన అని కూడా స్పష్టం చేశారు.

ఎన్నికలు వచ్చాయని చెప్పి జనంలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే నాయకులు వైసీపీ నేతలు కారని ఆయన అంటున్నారు. జగన్ ప్రజల మనిషి అని, ప్రజల కోసం ఏం చేయాలో జగన్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 

విశాఖలో వైసీపీ గెలుపుతోనే ప్రగతి పిలుపు కూడా ఉందని విజయసాయిరెడ్డి చెబుతూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు హైడ్రామా

Show comments