వరుణ్ తేజ్ ఛలో థియేటర్స్

వాల్మీకి సినిమా హడావుడి మొదలయింది. విడుదలైన రోజు బాగానే కలెక్షన్లు నమోదు చేసింది. ముందు రోజు రాత్రి అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం, పేరు మార్చడం వంటివి బాగానే కలిసివచ్చాయి. దాదాపు పాజిటివ్ సమీక్షలు కూడా వచ్చాయి. అయితే శనివారం కలెక్షన్లు ఆ మేరకు మాత్రం లేవు. కలెక్షన్లు స్టడీగా వున్నట్లే వుంది. కానీ శ్రీకాకుళం లాంటి మాస్ సెంటర్లలో ఫుల్స్ రాకపోవడం, అలాగే కింద సెంటర్లలో ఫుల్స్ రాకపోవడం, కాకినాడ, మరి కొన్ని చోట్ల ఫస్ట్ షో లు ఫుల్స్ కాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

సండే, మండే ట్రెండ్ లు చూస్తే సినిమా ఏ మేరకు చేస్తుంది అన్నది క్లారిటీ వస్తుందన్నది ట్రేడ్ వర్గాల బోగట్టా.

ఫస్ట్ డే హడావుడి చూసి, ఇది మరో ఇస్మార్ట్ శంకర్ రేంజ్ కలెక్ట్ చేస్తుందని అనుకన్నారు. కానీ శనివారం ట్రెండ్ చూస్తే అలా లేదు అంటున్నారు. సండే, మండే చూస్తే కానీ విషయంపై క్లారిటీ రాదని టాక్. 

ఇలాంటి నేపథ్యంలో మండే నుంచి కలెక్షన్లు జారిపోకుండా నిలబెట్టాలని 14రీల్స్ ప్లస్ యూనిట్ ఆలోచిస్తోంది. మండే నాడు ఓ సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం నుంచి థియేటర్ టూర్ ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.

వచ్చేవారం థియేటర్లలో సినిమా లేదు కనుక, సైరా వచ్చేవరకు షేర్ ను వీలయినంత పెంచాలని మూడు ఏరియాల్లో వరుణ్ తేజ్ థియేటర్ టూర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాకు 14రీల్స్ ప్లస్ సంస్థకు పెద్దగా మిగిలింది లేదు. బరాబర్ సరిపోయిందని బోగట్టా. ఇప్పుడు ఈ సినిమాను నిలబెట్టకపోతే, బయ్యర్లు జీఎస్టీ కట్టడం సమస్య అవుతుంది. అప్పుడు మళ్లీ 14రీల్స్ మీద అదనపు భారం పడుతుంది. అందుకే పబ్లిసిటీ ముమ్మరం చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.

ఇవన్నీ ఇలా వుంటే ఓవర్ సీస్ లో మాత్రం వాల్మీకి బయ్యర్ గట్టెక్కడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది.

Show comments