పవన్ సంతకు చీటీ

 గతంలో ఒక పెద్దాయిన చీటీ రాసాడట. ఏమని...? సంతకు రాయునది. లచ్చిక గాజులు వేయవలెను. అని. సంత అంటే బోలెడు దుకాణాలు వుండేది. అందులో ఏ దుకాణానికి ఈ లేఖ. అసలు లచ్చి ఎవరు? దానికి ఎందుకు గాజులు వేయాలి? ఎవరు వేయాలి? పైసలు ఎవరు ఇస్తారు? అప్పటి నుంచి పుట్టుకువచ్చింది. సంతకు చీటీ-లచ్చికి గాజులు. అన్న సామెత.

పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నిన్నటికి నిన్న విడుదల చేసిన ప్రకటన అచ్చంగా ఇలాగే వుంది. దానికీ దీనికీ ఏమీ తేడా లేదు. మరి ఎవరు ఆ ప్రకటన తయారుచేసారో? దానిపై పవన్ ఎలా సంతకం చేసారో?  ప్రకటన అన్నాక, అది ఎవరిని ఉద్దేశించినది అన్నది ఉండాలి కదా? డిమాండ్ అన్నాక, అది ఎవరిని అడ్రస్ చేస్తున్నది అన్నది ఉండాలి కదా? అబ్బే అవేమీ లేవు.

మిర్చి రైతుకు 11 వేలు వంతున గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇదీ డిమాండ్? ఎవరు ఇవ్వాలి. తెలంగాణనా? ఆంధ్రనా? లేక ఇద్దరు ముఖ్యమంత్రులనూ డిమాండ్ చేస్తున్నారా? ఆ విషయమే లేదాయె. కార్పొరేట్ కంపెనీల పై వున్న శ్రద్ద రైతులపై లేదంట? ఎవరికి? కేసిఆర్ కా? చంద్రబాబుకా? లేక ఇధ్దరికీనా?

పవన్ గోడమీద పిల్లి వాటం అన్నది ఆయన స్పీచ్ ల్లో తొంగి చూస్తుంటుంది. ఇక్కడా అదే వైఖరి కనిపిస్తోంది. నేరుగా కేసిఆర్ ను టార్గెట్ చేయరు. అందుకే ఇలాంటి అరకొర ప్రకటన ఇచ్చారు. కానీ పైగా చివర్లో ఓ డిమాండ్ చేర్చారు. మార్కెట్ ధరకి గిట్టుబాటు ధరకు మధ్య వత్యాసాన్ని చెల్లించాలని. ఇలాంటి స్కీము ప్రవేశపెట్టింది ఆంధ్రనే. కానీ పైకే స్కీము. దానికి సవాలక్ష షరతులు వర్తిస్తాయి. అది తెలియదేమో ? ఈ డిమాండ్ చేసారు పవన్. తెలంగాణనే అనుకోవాలి మరి.

అయితే ఇలా ఎందుకు? కేసిఆర్ ను కోరుతున్నా, బాబును డిమాండ్ చేస్తున్నా అని డైరక్ట్ గా ప్రకటన ఇవ్వొచ్చుగా?

Show comments