ఉంగరాల రాంబాబు మరింత ఆలస్యం?

డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా అలా అలా వెనక్కు వెళుతూ వస్తోంది ఉంగరాల రాంబాబు. ఆఖరికి ఈ నెల 18న విడుదల అవుతుందని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. కానీ కనీసం మరో రెండు వారాలు ఆలస్యం అవుతుందని ఇప్పుడు వార్తలు వినవస్తున్నాయి. డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. 

అమెరికాలో లాంగ్ షెడ్యూలు చేసుకువచ్చిన హీరో సునీల్ వాతావరణం, వాటర్ ఛేంజ్ వల్ల గొంతు ఇబ్బందితో బాధపడుతున్నాడట. అందువల్ల రోజుకు కేవలం గంట మాత్రమే డబ్బింగ్ చెబతున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ పూర్తయితే, రీరికార్డింగ్, డిటీఎస్ మిక్సింగ్ తదితర కార్యక్రమాలు వుండనే వున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలంటే కనీసం ఇంకా రెండు వారాలకు పైగానే టైమ్ పడుతుందని వినికిడి.

క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తం మీద సెప్టెంబర్ లోనే విడుదలకు ప్లాన్ చేసుకోవాల్సి వుంటుందని టాక్. ఇప్పటికే జవాన్, లండన్ బాబులు సినిమాలు సెప్టెంబర్ లోకి వెళ్లాయి. సెప్టెంబర్ 1న పైసా వసూల్, మూడు నాలుగు వారాల్లో జై లవకుశ, స్పైడర్ వున్నాయి. రామ్ నటించిన వున్నది ఒకటే జిందగీ కూడా సెప్టెంబర్ లోనే విడుదలకు రెడీ చేస్తున్నారు.

Show comments