బజ్ జారిపోయిందని బన్నీ గమనించారా?

పెద్ద సినిమాకు ఒకసారి ట్రయిలర్ వదిలిన తరువాత విడుదలకు ముందు మళ్లీ మరోసారి ట్రయిలర్ వదలడం అన్నది చాలా రేర్. అది కూడా రోజులు తేడాలో మరో ట్రయిలర్ వదలడం అంటే కాస్త ఆలోచించాల్సిందే.

బన్నీ-హరీష్ శంకర్ కాంబినేషన్ లోని డిజె సినిమాకు మాంచి బజ్ వచ్చింది. కానీ తీరా ట్రయిలర్ వదిలిన తరువాత జనాలు పెదవి విరవడం ప్రారంభించారు. బజ్ జారిపోవడం ప్రారంభంమైంది. దీంతో ప్రీరిలీజ్ సక్సెస్ మీట్ లో, లేని పోని భేషజాలకు పోకుండా, మరో ట్రయిలర్ కట్ చేసి వదిలారు.

డిజె ఇటు యాక్షన్ అటు కామెడీ కలయిక అని ఫస్ట్ ట్రయిలర్ లో చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఈ ట్రయిలర్ లో కూడా అదే ప్రయత్నం చేసారు. ట్రయిలర్ తొలి సగం అంతా బ్రాహ్మిన్ గెటప్ లో బన్నీ కామెడీ, మళ్ళి సగం అంతా యాక్షన్ పార్ట్ జోడించారు.

అంతా బాగానే వుంది కానీ, బ్రాహ్మిన్ గెటప్ లో బన్నీ కామెడీ అంతగా పడడం లేదన్నదే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాలు ఫీలవుతున్నది. అక్కడే ఎందుకో తేడా కొడుతోంది. సినిమాలో అది పండిందా? బ్లాక్ బస్టరే. Readmore!

Show comments